Salar -2, Prabhas : తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తో తిరుగులేని కథానాయకుడు అయ్యాడు తెలుగు ఇండస్ట్రీ లో.అంచెలంచెలుగా ఎదుగుతూ హాలీవుడ్ లో కూడా అడుగుమోపాడు ప్రభాస్. ఆయన సినిమా వస్తోందంటేనే అభిమానుల్లో కొండంత ఆనందం. ఒకవేళ ఏదేని కారణంతో ప్రభాస్ సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయిందని తెలిస్తే చాలు నిరాశతో కుంగిపోతారు. ఎందుకు ఆగిపోయింది. వచ్చిన సమాచారంలో నిజం ఎంత. అబద్దం ఎంత. దర్శకుడి కారణం ఏమైనా ఉందా. లేక నిర్మాతకు దర్శకుడికి గిట్టక పోవడంతోనే సినిమా షూటింగ్ మధ్యంతరంగా నిలిచిపోయిందా అనే విషయాలపై తెలుసుకోరు. సోషల్ మీడియా లో వచ్చిందంటే చాలు నమ్మేయడమే. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎవరో గిట్టని వారు సలార్ -2 సినిమా షూటింగ్ నిలిచిపోయిందని పోస్ట్ షేర్ చేశారు. వాస్తవానికి చిన్న, చిన్న సాంకేతిక కారణాల వలన ఆ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.
డిసెంబర్ 2023 న సలార్ -1 విడుదలై అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. నిర్మాతకు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ వసూళ్లు చేసిపెట్టింది. ఆ విజయంతో సలార్ -2 కూడా నిర్మిద్దామనే నిర్ణయానికి వచ్చారు దర్శక, నిర్మాతలు. వెంటనే స్క్రిప్ట్ కూడా తాయారు చేశారు. షూటింగ్ మొదలు పెట్టారు. ఎదో చిన్న కారణంతో సినిమా షూటింగ్ మధ్యంతరంగా నిలిచిపోయింది. కానీ సినిమాను పూర్తిగా నిర్మిచలేక పోతున్నామని పెట్టుబడిదారులు ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఎవరో గిట్టనివారు మాత్రం సోషల్ మీడియాలో చెడు ప్రచారం చేసారు. సలార్ -2 నిలిచిపోయిందని. తెలియడంతో అభిమానుల్లో నిరాశ మొదలైనది. కానీ ఇటీవల ఒక సందర్భంలో నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. సాలార్-2 స్క్రిప్ట్ పూర్తయిందని చెప్పేసారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ప్రకటించారు. సినిమా నిర్మాత ప్రకటన రావడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ఇక సినిమా షూటింగ్ పూర్తి చేయడంతో పాటు విడుదల తేదీని ప్రకటించడమే మిగిలి ఉంది.