Home » Singareni : సింగరేణిలో మూల్యం చెల్లించుకున్నBRS…సికాస

Singareni : సింగరేణిలో మూల్యం చెల్లించుకున్నBRS…సికాస

Singareni : గత ప్రభుత్వాల హయాంలో కార్మికులకు ద్రోహం జరిగింది. కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడారు. కార్మికుల జీవితానికి భద్రత లేకుండా పోయింది. కేవలం బొగ్గు ఉత్పత్తిపై మాత్రమే శ్రద్ధ చూపారు. కార్మికుల మనుగడ పై నిర్లక్ష్యం వహించారు. సింగరేణిలో ఓపెన్ కాస్ట్ గనులను రద్దు చేస్తామని అధికారం చేపట్టింది బిఆర్ఎస్ పార్టీ. ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతులు జారీ చేస్తూ గ్రామాలను వల్లకాడుగా మార్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం.

గత ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కలిసి పర్మినెంట్ కార్మికులను తగ్గించింది. కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను పెంచింది. సింగరేణి కార్మికులకు చేసిన ద్రోహానికి బిఆర్ఎస్ పార్టీ మూల్యం చెల్లించుకుంది. బిఆర్ఎస్ పార్టీకి కార్మికులు పుట్టగతులు లేకుండా చేసారు. గత ప్రభుత్వాల మాదిరిగానే మీరు కూడా కార్మికులకు ద్రోహం తలపెడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరుతో ఆదివారం మీడియాకు ఒక లేఖ విడుదల అయ్యింది.

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభాత్ తన లేఖలో కోరారు. అదేవిదంగా బొగ్గు బ్లాక్ లను సింగరేని సంస్థకే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ గనులను రద్దు చేసి, భూగర్భ గనులనే స్థాపించాలని కోరారు. నియామకాలనుపునరుద్దరించాలన్నారు. వారసత్వ ఉద్యోగాలను కార్మికుల కొడుకులకు, కూతుళ్లకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్వార్టర్ నిర్మాణం చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న వాటికీ మరమ్మతులు చేపట్టాలని కోరారు.

కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, క్యాజువల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేసి, 25 లక్షల హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభాత్ తన లేఖలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2004 లో అప్పటి ప్రభుత్వం కొందరిని మాత్రమే డిస్మిస్ కార్మికులను విధుల్లోకి తీసుకున్నది. మిగతా కార్మికులకు కూడా తీసుకోడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఆదాయపు పన్ను రద్దు చేసి కార్మికుల ఆర్థిక భారాన్ని తగ్గించాలన్నారు. ప్రతి కార్మికుడికి సొంత ఇంటి పథకం కింద 350 గజాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చి, 25 లక్షల వడ్డీ లేని రుణాన్ని కూడా ఇవ్వాలన్నారు.

కార్మికులపై మోపిన విజిలెన్స్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పదవి విరమణ పొందిన కార్మికులకు ప్రతి ఐదేళ్లకోసారి 20 శాతం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న హెల్త్ కార్డు పరిమితిని 25 లక్షలకు సవరించాలని సికాస కార్యదర్శి ప్రభాత్ సింగరేణి యజమాన్యంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులను నిర్లక్ష్యం చేయడం, వారి సమస్యలను పరిష్కరించని నేపథ్యంలో గత ప్రభుత్వాల మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూల్యాం చెల్లించుకోక తప్పదని ప్రభాత్ తన ప్రకటనలో హెచ్చరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *