కోల్ బెల్ట్ ప్రతినిధి:
ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు అరెస్టులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆమెను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలు లో పెట్టింది. బెయిల్ కోసం ఆమె న్యాయవాదులు చట్టములో ఉన్న చట్టాలను అన్నిటిని వాడుకున్నప్పటికిని ఆమెకు బెయిల్ రావడంలేదు. కొడుకు పరీక్షలు రాస్తున్నాడు,అవి ముగిసే వరకయినా బెయిల్ ఇవ్వాలని సంబంధిత కోర్టును లాయర్లు కోరిన బెయిల్ మంజూరు కావడంలేదు. ఇప్పటికే కవిత ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. తాజాగా కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది.తిహాడ్ జైలు లో ఉన్న కవితను సిబిడి గురువారం అరెస్టు చేసింది. తీహార్ జైల్ లో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో ఇదే కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్ లోని ఆమె ఇంటిలో లిక్కర్ కేసు గురించి ప్రశ్నించారు. అరెస్టు చేసిన కవితను శుక్రవారం కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారని సమాచారం.
కడిగిన ముత్యంలా వస్తాను…..
ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేస్తూ కవిత నాలుగు పేజీల లేఖను విడుదల చేసింది. తన అరెస్ట్ రాజకీయ కుట్రలో ఒక భాగమని పేర్కొంది. కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తానని అన్నారు.మానసికంగా తనను కావల్సుకోని కేంద్ర దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.