Home » ఒకరి చితిమంటలు ఆరకముందే మరోనటుడు చితిపైకి

ఒకరి చితిమంటలు ఆరకముందే మరోనటుడు చితిపైకి

xr:d:DAGBRDuLR64:101,j:295410298314336845,t:24041109

కోల్ బెల్ట్ ప్రతినిధి: హైదరాబాద్
సినీపరిశ్రమలో విషాదం నెలకొంది.ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.వెన్నుముకగా నిలిచిన నటులే ఎదో ఒకరూపంలో అనంత లోకాలకు పయనమవుతన్నారు.వారి కుటుంబాల్లో ఒకవైపు రోదనలు.మరోవైపు పరిశ్రమలో విషాదాలు.ఒక నటుడి చితి మంటలు ఆరకముందే మరో నటుడు చితిపైకి చేరుకుంటున్నారు.అభిమానుల,కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి.నటులు,విలన్ పాత్రధారులు,సాంకేతిక నిపుణులు,పరిశ్రమకు అండగా ఉన్నవారిలో ఎవరో ఒకరు పరిశ్రమను విడిచి కానరానిలోకాలకు వెళ్లడంతో ఇండస్ట్రీ లో విషాదం అలముకొంది.రోడ్డు ప్రమాదాలు,అనారోగ్యం,గుండె జబ్బులు వివిధ కారణాలతో నటులు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు.
కానరానిలోకాలకు సినీకళాకారులు…..
మార్చిలో పలు కారణాలతో హాస్య నటనలో పేరుగాంచిన ప్రముఖ నటుడు విశ్వేశ్వర రావు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రముఖ నటుడు వీర భద్రరావు కన్నుమూశారు. అదేవిదంగా ప్రముఖ రచయిత శ్రీ రామకృష్ణ, ఈయన కంటే ముందుగా మరో హాస్య నటుడు లక్ష్మీ నారాయణ సినీ లోకానికి దూరమయ్యారు. విలన్ గా టాలీవుడ్,కోలీవుడ్ లలో రాణిస్తున్న డేనియల్ బాలాజీ సైతం అతి చిన్న వయస్సులోనే హార్ట్ అటాక్ తో కన్నుమూశాడు.ఇటీవలనే బాలీవుడ్ నిర్మాత గంగూ రామ్ సే అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.ఉగాది పర్వదినం రోజున ప్రముఖ మాలీవుడ్ నటుడు సుజిత్ రాజేంద్రన్ ను రోడ్డు ప్రమాదం పొట్టనపెట్టుకుంది.
పెళ్లిపల్లకీలో ఊరేగకుండా…
పెళ్లిపల్లకీలో ఉరేగుతానని కళలు కన్న ఆ సినీ నటుడు పాడెతో ఊరు వదిలి వెళ్లిపోతానని ఊహించలేదు.విది వక్రీకరించింది.మృత్యువు వెంటాడింది.అతని ఎదుగుదలను అనంతలోకాలకు తీసుకెళ్లింది.పెళ్లి పీటలు ఎక్కకుండా స్మశాన వాటికకు తరలిపోవడంతో సినీలోకం దుఃఖంలో మునిగిపోయింది. ఛత్తిస్ ఘడ్ కు చెందిన ప్రముఖ విలన్,నటుడు సూరజ్ మోహర్ బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. గురువారం ఒడిశాలో అతనికి నిశ్చితార్థము జరగాల్సి ఉంది. షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి వస్తుండగా బిలాస్ పూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సహచరుడు,డ్రైవర్ గాయాలపాలుకాగా,సూరజ్ అక్కడికక్కడే చనిపోయాడు. 40 ఎల్లా సూరజ్ తల్లి దండ్రులకు ఒక్కడే కుమారుడు.దింతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చేతికందివచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో వారి దుఃఖాన్ని ఆపడం ఎవరితరం కావడంలేదు.ఛత్తీస్ ఘడ్ చిత్ర పరిశ్రమ సూరజ్ కు ఘనంగా నివాళులు అర్పించింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *