కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలను దక్కించుకోవాలని పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటివరకు 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.తెలంగాణలోనే భారీ ఎత్తున తుక్కుగూడలో బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల మ్యానిఫెస్టోను సైతం విడుదల చేసింది. దేశంలో ఎక్కడ కూడా విడుదల చేయకుండా కేవలం తెలంగాణలోనే మేనిఫెస్టో ప్రకటించడంలో సీఎం రేవంత్ రెడ్డి సఫలీకృతులయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే ఢిల్లీ పెద్దల వద్ద రేవంత్ రెడ్డి అంటే పదిమంది పెద్ద నాయకుల తలలో నాలుకలా తయారయ్యాడు.కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డి మాటకు ఢిల్లీలో తిరుగులేదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.14 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడంలో ఎక్కడ కూడా రాష్ట్రంలోని పెద్ద నాయకుల నుంచి భిన్నాభిప్రాయాలు రాలేదు. అంటే ఒక రకంగా పెద్ద లీడర్లకు అవకాశాలు ఇస్తూనే,తన పంథాను నెగ్గించుకుంటున్నాడు.
పార్టీ పెద్దలకు తలనొప్పి….
అభ్యర్థులను ప్రకటించడంలో ఇప్పటివరకు జరిగిన రాజకీయ తతంగం ఒక ఎత్తు అయితే, ప్రకటించాల్సిన మూడు స్థానాలు ఒకరకంగా తయారయ్యాయి.హైదరాబాద్,ఖమ్మం,కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం పార్టీకి పెద్ద తలనొప్పి తయారైనది.ఆ మూడు స్థానాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు ఆ స్థానాల పరిధిలో కీలక నేతల నుంచి వచ్చే ఒత్తిడి పార్టీని ముప్పు తిప్పలు పెడుతోంది.పార్టీ టికెట్ ఇవ్వరికి ఇవ్వాలో కూడా అదిష్టానం కు అంతుపట్టడంలేదు.ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతావారు పార్టీ అభ్యర్థి కోసం పనిచేస్తారు అనేది కూడా అదిష్టానంకు అనుమానంగానే ఉంది.మూడు స్థానాల్లో కరువు మంటే కప్పకు కోపం,విడువు మంటే పాముకు కోపం అనే చందంలా పార్టీ పరిస్థితి నెలకొంది.టిక్కెట్ల కేటాయింపులో ఒకటికి వందసార్లు ఆలోచించాల్సి వస్తోంది.
ఢిల్లీకి సీఎం ….
ఖమ్మం.హైదరాబాద్,కరీంనగర్ స్థానాల అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లారు.అధిష్టానంతో చర్చించి అభ్యర్థులను ఎంపికచేయడానికే ఢిల్లీ వెళ్లినట్టు కాంగ్రెస్ శ్రేణుల సమాచారం. హైదరాబాద్ స్థానం కు బలమైన అభ్యర్థి ఎవరనేది తేలడంలేదు. అక్కడ ఎంఐఎం అభ్యర్థిని తట్టుకునే సత్తాగల నాయకుడు అవసరం ఉంది. కాని నేటివరకు హైదరాబాద్ అభ్యర్థి ఎవరనేది పార్టీ శ్రేణులకు అంతుచిక్కడంలేదు.కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి,తీన్మార్ మల్లన్న, వెలిచాల రాజేంద్ర ప్రసాద్ పోటీపడుతున్నారు.కానీ కరీంనగర్ లో ఎక్కువగా సామాజిక వర్గం ఉండటంతో ఆ వర్గం మద్దతు ఉన్నవారి కోసం ఢిల్లీ పెద్దలు జల్లెడ పడుతున్నారు. ఖమ్మం స్థానంకోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని,మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ తనయుడు యుగంధర్ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరికీ టికెట్ ఇచ్చిన మిగతావారు మద్దతు ఇవ్వరు అనే అభిప్రాయం కూడా అధిష్టానం దృష్టిలో ఉంది. వీరితోపాటు రాయల నాగేశ్వర్ రావ్,కుసుమ్ కుమార్,మండవ వెంకటేశ్వర్ రావ్ కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. చివరికి మిగిలేది ఎవరో,ఉండేది ఎవరో అనేది సీఎం చేతిలోనే మిగిలి ఉంది.