Narayana : భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్ చేసి సంచలనం సృష్టించారు. రేవంత్ రెడ్డి జైలు కు వెళ్లే అవకాశాలు సైతం ఉన్నాయని స్పష్టం చేశారు. కొందరు పెద్ద మనుషుల ఒత్తిడితో సీఎం రేవంత్ రెడ్డి జైలు కు వెళ్లే ప్రమాదం సైతం ఉందన్నారు. కాబట్టి శ్రీ కృష్ణుడి జన్మ స్థలమైన జైళ్లను శుభ్రం చేయాలని నారాయణ ఎద్దేవా చేశారు. హైడ్రా దూకుడు తట్టుకోలేక కొందరు జైలుకు వెళ్లక తప్పదన్నారు.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారు. పులి మీద నుంచి కింద పడితే ఆ పులి మింగుతుంది. పులి బారి నుంచి రేవంత్ రెడ్డి ని ఎవరు కూడా కాపాడలేరు. బడాబాబుల ఒత్తిడితో సీఎం జైలు కు వెళ్లే ప్రమాదం ఉందని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్టుగా ప్రభుత్వ సంస్థలతో ప్రైవేట్ నిర్మాణాలను పోల్చడం సరికాదన్నారు. ప్రభుత్వ సంస్థల్లో నిర్మించింది ప్రభుత్వ కార్యాలయాలు. అవి ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఈ విషయంలో అవసరమైతే సీఎం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నారాయణ కోరారు.