FIR entry by CID: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజు రోజుకి వేడిక్కి పోతోంది. గెలుపు ఓటములు తరువాత. ఇప్ప్పుడు అధికారంలో ఉన్నాం. తరువాత అధికారంలో ఎవరు ఉంటారో తెలియదు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే కక్ష తీర్చుకోడానికి ఏపీ లో వైసీపీ ప్రభుత్వం తెర లేపిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అమలవుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ నాయకులు చెడు ప్రచారం చేస్తున్నారంటూ ఎన్నికల కమిషన్ కు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై స్పందించిన ఎన్నికల కమిషన్ విచారణకు సీఐడీ ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు విచారణ చేపట్టి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కేసు నమోదు చేశారు.
చంద్ర బాబు నాయుడిని ఏ 1, లోకేష్ ను ఏ 2 గా చేరుస్తూ సీఐడీ అధికారులు FIR నమోదు చేశారు. వీరిద్దరితోపాటు IVRS ఫోన్ కాల్ చేసిన ఏజెన్సీ సంస్థలపై కూడా కేసు నమోదు కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైనది. ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ చట్టం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటె దానిపై టీడీపీ అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తోందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆస్తుల రక్షణ కోసం తీసుకు వచ్చిన చట్టాన్ని అమలు చేయకుండా అడ్డుకొంటూ టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
ప్రజలు సంపాదించుకొన్న ఆస్తులపై హక్కులు పొందడానికే చట్టాన్ని తీసుకు రావడం జరిగిందనేది వైసీపీ వాదన. పేదల ఆస్తులను అక్రమంగా కబ్జా చేయడానికే వైసీపీ ప్రభుత్వం చట్టాన్ని అమలు చేసిందని టీడీపీ ఆరోపణ. అదేవిదంగా ఈ చట్టం పూర్తిగా వైసీపీ నేతల అక్రమాలను సక్రమం చేయడానికే తీసుకువచ్చారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
కస్టపడి ప్రతి పేదవాడు సంపాదించుకొన్న ఆస్తికి రక్షణగా ఉండటానికే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని వైసీపీ ప్రజలకు వివరిస్తోంది. ఈ చట్టం అమలు కావడం టీడీపీ నేతలకు ఇష్టం లేదని, కొత్తగ వచ్చిన చట్టంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ నేతలకు మేలు జరుగుతుందనే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.