BJP Minister : కేంద్రంలో ముచ్చటగా మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే లు కూడా బీజేపీ కె అనుకూలంగా ఉన్నాయని ప్రకటించాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలం అనూహ్యంగా పెరిగింది. ఒంటరిగా పోటీచేసి ఎనిమిది స్థానాల్లో విజయాపతాకాన్ని ఎగురవేసింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నాలుగు స్థానాల్లో తన బలాన్ని చూపించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. అంచెలంచెలుగా బీజేపీ ఎదుగుతున్న తీరు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు కునుకు లేకుండా చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలాన్ని చూసిన ఢిల్లీ నాయకుల్లో సంతోషాన్ని నింపింది. ఆ బలం ఆసరాతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ పెద్దలు తరలివచ్చి విస్తృత ప్రచారం చేశారు. అభ్యర్థులకు భరోసా నింపారు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. పదుల స్థానంలో గెలుస్తామనే ధీమాలో కేంద్రంతో పాటు, రాష్ట్ర నాయకులు సైతం ధీమాలో ఉన్నారు.
2019 ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు గెలుపొందారు. సికింద్రాబాద్ స్థానం నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డి కి కేంద్ర మంత్రి వర్గంలో బెర్త్ దొరికింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని భాద్యతలో ఉంచింది. ఊహించని నాటకీయ పరిణామంలో బండి సంజయ్ ని రాష్ట్ర బాధ్యతల నుంచి తొలగించి కేంద్ర కమిటీలోకి తీసుకొంది పార్టీ. రాష్ట్ర భాద్యతలను మంత్రి కిషన్ రెడ్డి కి అప్పగించారు.
బీజేపీ 400 స్థానాల్లో కాషాయం పథకాన్ని ఎగురవేయడం ఖాయమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. బీజేపీ సొంతంగా 200 స్థానాలు సాధించినా ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ఎవరు కలిసి వచ్చిన, రాకపోయినా 200 స్థానాలు వచ్చిన అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అప్పుడు మంత్రివర్గం ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రము నుంచి ఎవరికి బెర్త్ దొరుకుతుందనే చర్చ మొదలైనది పార్టీ శ్రేణుల్లో.
రాజ్యసభ సభ్యుడిగా లక్షణ్ ఉన్నారు. ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు. ప్రస్తుతం కిషన్ రెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. ఆదేవిందగా కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఉన్నారు. లక్ష్మణ్ హయాంలోనే నాలుగు ఎంపీ స్థానాలు సాధించింది పార్టీ. బిఆర్ఎస్ పార్టీ పై అయన దూకుడుగానే వ్యవహరించారు. బండి సంజయ్ కూడా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా చేశారు. కానీ కిషన్ రెడ్డి భాద్యతలు చేపట్టిన తరువాత ఆ ఇద్దరి నాయకులంత ఒత్తిడి కేసీఆర్ కు రాలేదు.
తెలంగాణాలో ఈ ముగ్గరు కీలకంగా ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఈటల రాజేందర్ సీనియర్ నాయకుడైన అప్పుడే మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు. ఆదిలాబాద్ నుంచి గొడం నగేష్ గెలిస్తే ఆయనకే గిరిజన కోటాలో మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆయనతో పాటు లక్ష్మణ్ లేదా కిషన్ రెడ్డి ఇద్దరిలో ఒకరికి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం.