YS Jagan failure in AP: ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అవినీతి లెక్కలేనంతగా జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు అవినీతి గురించే మాట్లాడు కుంటున్నారు. లిక్కర్, ఇసుక, భూ కబ్జాలు ఇలా ఎన్నో అవినీతి పనులు చేసిన వైసిపీ ప్రభుత్వం రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో నిలిచిందని మోదీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలుగు దేశం,జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి అభ్యర్థుల తరపున ఏపీ లో నరేంద్ర మోదీ ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. అవినీతి, అక్రమాలు, పరిపాలన, సమయ పాలన, దాడులు ఇలా ఎన్నింటినో వివరిస్తూ తన ప్రసంగంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
వైసీపీ అధినేత తన ఐదేళ్ల పరిపాలనలో చేసిన అభివృద్ధి పై ఆధారపడి ప్రజల్లోకి వెళ్లారు. బస్సు యాత్ర చేపడుతూ రోజుకో జిల్లాను చుట్టేస్తున్నారు. ఒకవైపు కూటమి, మరోవైపు కాంగ్రెస్ కండువా కప్పుకున్న సోదరి. ఈ రెండు వర్గాలను డీ కొంటున్నారు జగన్. రెండోసారి అధికారం ధ్యేయంగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. జగన్ ను ఇంటిదారి పట్టించడానికి ఒకవైపు ఇంటిపోరు, మరోవైపు కూటమి పోరు. రెండు పోరులను తట్టుకొని రెండోసారి విజయాపథకాన్ని ఎగురవేయడానికి చేస్తున్న ప్రయత్నాలను దెబ్బకొట్టడానికి కూటమి ఏకంగా మోడీనే రంగంలోకి దించింది.
మోదీ తన ప్రసంగంలో ఎక్కువ సమయాన్ని సీఎం జగన్ ను లక్ష్యముగా చేసుకున్నారు. జగన్ పై మాటల తూటాలు పేల్చారు. ఐదేళ్ల సమయాన్ని జగన్ ప్రభుత్వ వృధా చేసి ప్రజల సమస్యలను పట్టించుకోలేదు. అభివృద్ధి ఎక్కడ కనబడుతలేదు. చేయని అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అవినీతిలో నంబర్ వన్ అయ్యింది. అధికారం లోకి రావడం కోసం లిక్కర్ ను రాష్ట్రంలో అనుమతించమని ప్రగల్బాలు పలికారు. ఆ లిక్కర్ నే అడ్డుపెట్టుకొని సంపాదనలో పోటీ పడింది వైసీపీ ప్రభుత్వం, కానీ అభివృద్ధిలో మాత్రం పోటీపడలేదంటూ ఘాటుగా విమర్శించిన తీరు చూస్తే జగన్ ను ఓడించాలనే పట్టుదల ప్రధాన మంత్రి మోదీ మాటల్లో కనిపించిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
మద్యం వ్యాపారులు అంత కలిసి సిండికేట్ ఐతే జగన్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదంటూ మోదీ తన ప్రసంగంలో ఆరోపించారు. చివరకు లిక్కర్ పై కూడా అధిక ధర మోపడంతో ప్రజలు ఆర్థికంగా నష్టపోయారంటూ వివరిస్తూ మద్యం ప్రియులను కూడా మోదీ ఆకట్టుకునే ప్రయత్నం చేయడం విశేషం. అవినీతి లో వేగంగా ఉన్న ప్రభుత్వం అభివృద్ధి లో కూడా వేగంగా ఎందుకు లేదని ప్రశ్నించి వైసీపీ పరిపాలన అసమర్థ పాలన అంటూ విమర్శించారు. మూడు రాజధానులు ఆంటూ గొప్పగా చెప్పిన జగన్ ఒక్క రాజదానిని కూడా ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే మీ అందరి జీవితాలు బాగుపడు తాయని నేను కూడా ఆశించా. అందుకోసం నిధులు అడిగితే మీ ముఖ్య మంత్రికి మంజూరు చేశా. ఏది పోలవరం నిర్మాణం అంటూ జగన్ పనితీరును ఎండగట్టారు.
మోదీ పర్యటన ఖరారు అయినా నాటి నుంచి ప్రసంగం మొదలు పెట్టేవరకు ఏపీ ప్రజలు ప్రసంగం పై ఆసక్తితో ఉన్నారు. జగన్ పనితీరును విమర్శిస్తారా లేదా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైనది. ఆశించిన మేరకు మోదీ ప్రసంగం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా మరికొందరు రాజకీయ నిపుణులు మాత్రం కొంత మేరకు ఫరవాలేదనడం విశేషం.
———————
ఎడిటర్ : పీఆర్ యాదవ్
9603505050
———————