Home » Politcs : నాడు మీరు చేసింది మరచిపోయారా ?

Politcs : నాడు మీరు చేసింది మరచిపోయారా ?

Politcs : బిఆర్ఎస్ ఎమ్మేల్యేలు కొత్త పల్లవి ఎంచుకున్నారు. అసెంబ్లీ చర్చల్లో మాకు కూడా పిపీటీ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతం మరచిపోయి నేడు సుద్దపూస మాటలు మాట్లాడితే ఎలా అంటున్నారు రాజకీయ శ్రేణులు. అంతే కాదు నాడు మీరు అసెంబ్లీ లో చేసింది అప్పుడే మరచిపోతే ఎలా అంటున్నారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు మాట్లాడటానికి ఎంత సమయం ఇచ్చారు, ఎవరెవరి మైక్ కట్ చేశారు, ఎంత మందిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు అనేది ఒక్కసారి గుర్తుకు చేసుకోవాలంటున్నారు.

పదేళ్ల గులాబీ పరిపాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లో తమ మాటకు నోచుకోలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై గొంతు విప్పలేకపోయింది. మాట్లాడటానికి సమయం ఇచ్చేవారు కాదు. చిన్న, చిన్న కారణాలకు సస్పెండ్, మైకులు కట్ చేయడం వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చర్చలు పక్కకుపెట్టి ఏకపక్ష నిర్ణయాలకు బిఆర్ఎస్ ముందుండేది. కానీ కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్షాలకు మాట్లాడటానికి అవకాశం లభిస్తుంది. చర్చలకు వేదిక అయ్యింది. అందుకు ఇప్పటి వరకు జరిగిన సమావేశాలే తార్కాణం.

అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై 2016 లో సుదీర్గమైన పీపీటీ ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ వాదనను పీపీటీ ద్వారా వినిపిస్తామంటే అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వానికి మాత్రమే ప్రజంటేషన్ ఇచ్చే హక్కు ఉంటుందని దాటవేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు మాత్రం పీపీటీ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయడం వింతగా ఉంది.

నాడు ప్రతిపక్షము ఏ అవకాశాన్ని కోరిందో ఇప్పుడు అదే అవకాశాన్ని బిఆర్ఎస్ నేతలు కోరడం విశేషం. కానీ అప్పుడు తిరస్కరించిన వారే నేడు కోరడం విడ్డురంగా ఉందంటున్నారు రాజకీయ శ్రేణులు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా ఉంది. అప్పుడు బిఆర్ఎస్ సభలో ఎలాంటి సాంప్రదాయం పాటించిందో , అదే సాంప్రదాయం పాటిస్తామంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. నాడు ప్రజాస్వామ్యబద్దంగా గులాబీ నేత మెదులుకొని ఉంటే, నేడు కూడా కాంగ్రెస్ అదే బాటలో నడిచేదంటున్నారు రాజకీయ శ్రేణులు .

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *