CM Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని ప్రస్తుత ఏపీ సీఎం, వైసీపీ అధినేత వై ఎస్ జగన మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల వైఎస్ జగన్ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూకు ఇచ్చిన సందర్బంగ ఆసక్తికరంగా మాట్లాడారు. జూన్ నాలుగున ఓట్ల లెక్కింపున వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీ తో గెలువనున్నారని జగన్ ముందుగానే జోస్యం చెప్పి ప్రత్యర్థులను త్రిశంకు స్వర్గంలో పడేశారు. ఫలితాలు వెలువడిన తరువాత నేనే ముఖ్యమంత్రిగా విశాఖ పట్టణంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చెప్పడంతో జగన్ విజయావకాశాలపై అప్పుడే చర్చ మొదలైనది. రాష్ట్ర అభివృద్ధికి అన్ని సదుపాయాలు విశాఖ లో ఉన్న నేపథ్యంలోనే అక్కడి నుంచే నూతన ప్రభుత్వం పరిపాలన చేపట్టాలని వైసీపీ నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రము దివాళా తీసిందని, తన పరిపాలనతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్న నేపథ్యంలోనే మరోసారి అధికారం చేపడుతున్నామని చెప్పడం విశేషం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసి నష్టం చేయడంతోనే ప్రజలు వైసీపీ ని నమ్ముకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రావడం ఒక్క జగన్ తోనే సాధ్యం అవుతుందని ఆయన చెప్పడంపై ప్రజలు నమ్మలేకపొతున్నారు.
పక్క రాష్ట్రమైన తెలంగాణాలో వైసీపీ పార్టీని స్థాపించే ఆలోచన చేయడంలేదు. సొంత రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లోనే పార్టీ అభివృద్ధి చేయడం తన కర్తవ్యమని చెప్పడం వెనుక జగన్ కు పక్క రాష్ట్రాల్లో పార్టీ ని స్థాపించడం ఇష్టం లేదని తేలిపోయింది. నా రాష్ట్రము, నా పార్టీ అంటున్న జగన్ కు కేవలం ఢిల్లీ రాజకీయాలే ముఖ్యమనే సందేశాన్ని ప్రజలకు వివరించినట్టయింది. అంటే రెండోసారి ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టడం ఖాయమనే సంకేతాలు పంపేశారు జగన్.
తన జీవితం చాల చిన్నదని చెబుతున్నాడంటే, ఇంత చిన్న వయసులో రాష్ట్రము వదిలిపెట్టి పోవడం ఎందుకు అనే విషయాన్నీ చెప్పకనే చెప్పేసాడు జగన్ మోహన్ రెడ్డి. చిరకాలం ప్రజలకు గుర్తుండిపోయే విదంగా పరిపాలన చేయడమే ధ్యేయమంటున్నారంటే అధికారం రెండోసారి కూడా తనదే అని చెప్పకనే చెప్పేశారు. ఒకవైపు కూటమి, మరోవైపు ఇంటిపోరు కూడా జగన్ పరిపాలనను అడ్డుకోలేవని చెప్పేశారంటే, ఆయన పరిపాలనపై నమ్మకం ఉందనే విషయం తేలిపోయింది.