Congress: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.పరిపాలన రెండు నెలలపాటు కొనసాగింది. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను ప్రకటించింది.ఒకవైపు వాటి అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి,మంత్రివర్గ సహచరులు నిర్ణయాలు తీసుకుంటుంన్నారు. మరోవైపు బీజేపీ కంటే ఒక అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ విమర్శలకు దిగింది.ఆరు హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనదంటూ బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆరునెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమంటూ బహిరంగంగానే ప్రకటన చేశారు గులాబీ నాయకులు.వారి ఆరోపణలు పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచాడు.బీజేపీ,బిఆర్ఎస్ కు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరడం మొదలు పెట్టారు.
కనుమరుగయిన గులాబీలు…….
కండువాలు మార్చుకునే సంప్రదాయం మంచిర్యాల జిల్లాకు సైతం చేరింది.జిల్లాలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు.కోల్ బెల్ట్ ప్రాంతంలో గులాబీ పార్టీ అభ్యర్థులు ఆసిఫాబాద్ మినహా అందరు తుడిచి పెట్టుకుపోయారు.ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు పదేళ్ళపాటు అధికారాన్ని అనుభవించారు. ఒక్కసారిగా ఒకవైపు రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోవడం, మరోవైపు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో యూనియన్ ఓడిపోవడం జరిగింది.దీనితో టీబీజీకేఎస్ నాయకుల్లో పలువురు అగ్రనేతలు ఐఎన్టీయూసీ గూటికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు.ఆ నాయకులను ఆదిలోనే ఐఎన్టీయూసీ నాయకులు అడ్డుకున్నారు.
వెనక్కి తగ్గారు….
ఈ నేపథ్యంలో కొద్దిరోజులు బాణం నాయకులు వెనక్కి తగ్గారు.ఐఎన్టీయూసీ లో నేరుగా చేరుదామంటే కీలక నేతలు అడ్డుకుంటున్నారు.తిరిగి వాళ్ళ చేరికకు మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టారు.ముందుగా కాంగ్రెస్ లో చేరి ఆ తరువాత నెమ్మదిగా యూనియన్ లో చేరడానికి గులాబీ నాయకులు నిర్ణయించుకున్నారు. జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే తో దృడమైన బంధం ఉన్న ఆ గులాబీ నాయకుడు ఒక్కడే ప్రస్తుతం చేరడానికి సిద్దమయ్యాడు.ఆ నాయకుడు యూనియన్ లో చేరిన అతని స్థాయికి తగిన పదవి లేదు కానీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు సహాయం చేయడానికే ఆ గులాబీ నాయకున్ని పార్టీలోకి తీసుకు వస్తున్నట్టుగా జిల్లాల్లో ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ గులాబీ నాయకుడు ఉగాది పండుగకు ముందే కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు కాంగ్రెస్,ఐఎన్టీయూసీ నాయకులు చెవులు కొరుక్కోవడం కొసమెరుపు.