BJP Target : భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఊహించని రీతిలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కూడా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ ఢిల్లీ పెద్దలు కలగనలేదు. అదేవిదంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఢిల్లీ వరకు వస్తారని ఆశలు పెట్టుకోలేదు. మంచి మెజార్టీ ఫలితాలు రావడంతో బీజేపీ రాష్ట్రంలో గట్టి పట్టు ఉన్న పార్టీ గా నిలిచింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నిర్వహణపైననే పార్టీ శ్రేణుల్లో కొంత వరకు అసంతృప్తి నెలకొంది. ఎన్నకల్లో మెజార్టీ కనిపించడంతో పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వం చేయించాలని పార్టీ జాతీయ కమిటీ నిర్ణయించింది. 50 లక్షల సభ్యత్వం లక్ష్యాన్ని చేరుకుంటే రాబోయే ఎన్నికల్లో విజయం కూడా సాధ్యమవుతుందని జాతీయ నాయకుల ఆలోచన.
సభ్యత్వ నమోదు అభియాన్‌పై ఢిల్లీలో బీజేపీ వర్క్ షాప్ కూడా నిర్వహించింది. పార్టీ శ్రేణులకు సభ్యత్వ నమోదు పై శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. సభ్యత్వ నమోదు లక్ష్యం చేరుకోడానికి పన్నెండు మంది నాయకులుతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, మరికొందరు రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారు. సభ్యత్వ నమోదు పూర్తి చేసి పార్టీ సంస్థాగతంగా కమిటీలు ఏర్పాటు చేయడానికి పార్టీ సన్నద్ధమవుతోంది.
ప్రతి జిల్లాకు ఒక ప్రముఖ్, ఇద్దరు సహా ప్రముఖ్ లను నియమించారు.సభ్యత్వ నమోదును సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మొదటి విడత గా నిర్ణయించారు. మొదటి విడత సెప్టెంబర్ 25 వరకు, రెండో విడత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పదిహేను తేదీవరకు సభ్యత్వాన్ని పూర్తి చేయనున్నారు. అక్టోబర్ 16 నుంచి 31 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు చేయాలని నిర్ణయించారు. నవంబర్ 1 నుంచి 10 వరకు ప్రాథమిక సభ్యత్వం చేసి లక్ష్యాన్ని పూర్తి చేయనున్నారు.