Actor : సినిమా ప్రపంచం ఒక రంగుల లోకం. ఆ రంగుల లోకంలో చేరిన వారు కోటీశ్వరులు అవుతారు. కానరాని వారు కూడా అవుతారు. అందుకనే సినిమా ప్రపంచాన్ని రంగుల ప్రపంచం అంటారు. ఆ రంగుల ప్రపంచంలో చేరిన అందాల ముద్దుగుమ్మలు కొందరు తొందరగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటారు. మరికొందరు పెళ్లి తరువాత కూడా సినిమా లోకంలోనే జీవిస్తారు. వీరిలో ఒక అందాల ముద్దుగుమ్మ ఒకే ఒక్క సినిమాలో నటించింది. కానీ కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులకు వారసురాలైనది. ఆమె ఎవరంటే…..
నాగపూర్ లో జన్మించిన ఆ అందాల ముద్దుగుమ్మ పేరు గాయత్రీ జోష్. మొదట మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తరువాత ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొని, మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె మిస్ఇంటర్నేషనల్ 1999 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.
ఆ తరువాత హిందీ సినిమా రంగంలో చేరింది. మొదటి సినిమా “స్వదేశ్” తో ఎంట్రీ ఇచ్చి, అభిమానులను సంపాదించుకొని, తిరుగులేని నటిగా గుర్తింపు పొందింది. ఆ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. తర్వాత ఆమె సినిమాలకు దూరమైనది. ఆ సినిమా తరువాత వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ను వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడింది. ఇప్పుడు ఆమె వ్యాపార రంగంలో స్థిరపడి కోట్లాది రూపాయల ఆస్తికి వారసురాలు అయ్యింది.