Good News For Rural : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ యువతీ, యువకులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేసింది. ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంటుంది. నిరుద్యోగులు ఎక్కువగా ఆన్ లైన్ లో శిక్షణ తరగతులు వింటున్నారు. ఉద్యోగ అర్హత పరీక్షలకు కూడా మొబైల్ ద్వారా సన్నద్ధమవుతున్నారు. ఇటివంటి వారందరు కూడా ఇంటర్ నెట్ కనెక్షన్ ద్వారానే పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారంతా కూడా మధ్యతరగతి, పేదవారు. ప్రతి నెల వాళ్లు ఐదువందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఇంటర్నెట్ కోసం వెచ్చిస్తున్నారు. ఇప్పుడు వారందరితో పాటు పట్టణ ప్రాంత యువతీ , యువకులకు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా కనెక్టివిటీని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలతో పాటు గ్రామాల్లోని 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు ప్రతి నెల మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కనెక్షన్ ద్వారా కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు ప్రతి ఇంటికి అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.
రాష్ట్రంలో ఇప్పటికే మూడు వందల రైతు వేదికలకు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలకు టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రూ. 1779 కోట్ల పెట్టుబడులతో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రూ. 530 కోట్లను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించింది ప్రభుత్వం. మిగతా నిధులు కూడా వెంటనే మంజూరు చేసి ఇంటర్ కనెక్షన్ ను ప్రతి ఇంటికి తక్కువ ధరకే అందించాలని లక్ష్యంగా పెట్టుకొంది.