Padabi Vandanam MLA : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రణరంగం ముగిసింది. ఫలితాలు వెలువడ్డాయి. వైసీపీ ప్రభుత్వం పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు దేవస్థానాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటున్నారు.
మరి కొందరు తమ ఇళ్లల్లో తల్లి, దండ్రులకు పాదాభి వందనం చేస్తున్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు కన్నతల్లిదండ్రులతో సమానంగా భావించే అన్నకు పాదాభివందనం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కేక్ కోసి సంబరాలు చేసుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక ఎమ్మెల్యే ఏకంగా వదినకు పాదాభి వందనం చేసి తన ఋణం తీర్చుకున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరు… ఆ వదిన ఎవరు తెలుసుకుందాం ….. ఇప్పుడు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని పిఠాపురం ఎమ్మెల్యే గ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70 వేల పైబడి మెజార్టీ తో విజయం సాధించారు. అంతే కాదు ఆయన పార్టీ తరుపున పోటీచేసిన అభ్యర్థులు అందరూ గెలుపొందారు. జనసేన పార్టీ అభ్యర్థులు గెలవడానికి చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ విస్తృత ప్రచారం చేశారు. ఒక్క అల్లు అర్జున్ కుటుంబం మాత్రం ప్రచారానికి దూరంగా ఉంది.
సాధించిన విజయాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా పంచుకోడానికి ప్రముఖ నటుడు అయిన అన్న చిరంజీవి ఇంటికి కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే, నటుడు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆయనకు చిరంజీవి తో సహా కుటుంబ సభ్యులు అందరు ఘనంగా స్వాగతం పలికారు. తల్లి అంజనా దేవి దిష్టి తీసి అభినందించింది. ఆనందంలో పవన్ కళ్యాణ్ ముందుగా చిరంజీవికి పాదాభి వందనం చేశారు. ఆ తరువాత తల్లికి పాదాభి వందనం చేశారు. వెంటనే చిరంజీవి భార్య సురేఖ కు పాదాభి వందనం చేయబోతుండగా పవన్ కళ్యాణ్ చేతులకు అడ్డు చెబుతూ ఆమె వారించింది. అయినప్పటికీ ఆమె వద్దన్నా వినకుండా పవన్ కళ్యాణ్ సురేఖకు పాదాభి వందనం చేశారు. ఇలా ఆ ముగ్గురికి పాదాభి వందనం చేసి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్నారు.