Home » Ex CM KCR : జనంలోకి సారొస్తున్నారు …..

Ex CM KCR : జనంలోకి సారొస్తున్నారు …..

Ex CM KCR : తెలంగాణ ఉద్యమ కారుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కనిపించారు. ఆ తరువాత పార్టీ ఓటమి చెందిన తరువాత ఇంటి నుంచి బయటకు రాలేదు. ఎట్టకేలకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కనిపించారు. రైతులకు మద్దతుగా కరీంనగర్ జిల్లా తోపాటు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అసెంబ్లీ సమావేశాలకు ఒకే ఒక్క రోజు బడ్జెట్ సమావేశానికి హాజరైనారు. ఇక అప్పటి నుంచి ప్రజలకు దూరంగానే ఉంటున్నారు. కేసీఆర్ బయటకు రావాలని అధికార పార్టీ ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ఆయన మౌనంగానే గడుపుతున్నారు.

గత కొద్ది రోజుల నుంచి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అదేవిదంగా బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుందని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ మాజీ మంత్రి, పార్టీ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్ మాత్రమే స్పందిస్తున్నారు. పార్టీ విలీనం పై కేటీఆర్ స్పందన కూడా అత్తెసరు మాదిరిగానే ఉందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. పార్టీ శ్రేణులు కూడా విలీనాన్ని ఖండించడం లేదు. పార్టీ విలీనం పై ఇంత రచ్చ జరుగుతున్నప్పటికీ అధినేత కేసీఆర్ మాత్రం నోరుమెదపడంలేదు. ఎదో ఒకరోజు కేసీఆర్ నుంచి పార్టీ విలీనం గురించి స్పష్టమైన వివరణ వస్తుందని గులాబీ శ్రేణులు ఆశించారు. అయినా కేసీఆర్ నుంచి మాట లేదు, ముచ్చట లేదు. దింతో గులాబీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు.

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంకా ఎన్నడు బయటకు వస్తారు ? . అసెంబ్లీకి రాలేదు. ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడంలేదు. ప్రజల భాదలు పట్టించుకోని నాయకుడికి ప్రతిపక్ష పదవి ఎందుకు ? ఈ విదంగా రాష్ట్రంలో గత కొన్ని నెలల నుంచి ప్రజల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నవి. ఈ నేపథ్యంలో కేసీఆర్ రైతు యాత్రకు నడుం బిగించారు. ప్రజల్లోకి వస్తున్నారు. రైతు రుణమాఫీ విషయంలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వం విఫలం అయ్యింది. దీన్ని ఆసరా చేసుకొని కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారనే విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు గురువారం ఆలేరులో ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చదానికి ప్రభుత్వం పై రైతు యాత్ర ద్వారా ఒత్తిడి తీసుకురాబోతున్నారని హరీష్ రావు తెలిపారు. రైతు యాత్ర చేపట్టే తేదీలను మాత్రం పార్టీ పరంగా ప్రకటించాల్సి ఉంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *