Home » Janwada-farm-House : అప్పుడు నాదే… ఇప్పుడు నాది కాదు…

Janwada-farm-House : అప్పుడు నాదే… ఇప్పుడు నాది కాదు…

Janwada-farm-House : జన్వాడలోని ఫామ్ హౌస్ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా జన్వాడలో ఫామ్ హౌజ్ నిర్మించారని గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు హైడ్రా తనిఖీలకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశం అయ్యింది. జన్వాడ ఫామ్ హౌస్ నిర్వాహకులు కోర్ట్ ను ఆశ్రయించారు. హైడ్రా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోర్ట్ ఆదేశించింది.

జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఒకవైపు హై కోర్ట్ లో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. ఆ ఫామ్ హౌస్ తనది కాదని స్పష్టం చేశారు. తనకు తెలిసిన తన మిత్రుడిది అని ప్రకటించారు. అంతే గాని తనది మాత్రం కాదని, దాన్ని నేను లీజుకు తీసుకుకున్నానని చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగురవేశారు. అప్పుడు సంబంధిత అధికారులు ఇది మంత్రి కేటీఆర్ కు సంబందించిన ఫామ్ హౌస్ అని, దానిపై డ్రోన్ ఎగుర వేయడం నేరమంటూ రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.

అధికారులు కేసు నమోదు చేసేటప్పుడు ఫామ్ హౌస్ తనది కాదని ప్రకటించలేదు. ఇప్పుడు హైడ్రా చర్యల నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదంటున్నారు. తన స్నేహితుడిది అని ప్రకటించడం గమనార్హం. జన్వాడ ఫామ్ హౌస్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నిర్మించి ఉంటె కూల్చివేయడానికి తనకేమి అభ్యంతరం లేదన్నారు. అవసరమైతే తానే దగ్గరుండి సహకరిస్తానని స్పష్టం చేశారు.

కేటీఆర్ మంత్రి హోదాలో ఉన్న నాయకుడు. గత కొన్నేళ్లుగా అక్కడే కేటీఆర్ ఉంటున్నారు. అందులోనే ఉంటున్న కేటీఆర్ కు ఇది అక్రమమా, సక్రమమా అనేది తెలియకుండానే ఇన్నేళ్ళుగా ఉంటున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భాద్యతాయుతంగా పనిచేసిన కేటీఆర్ నిబంధనలు పట్టించుకోకుండా అన్ని రోజులు ఎలా ఉంటాడు అనే ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. తనది కాబట్టే ముందస్తుగా కోర్టుకు వెళ్లాడని, కూల్చి వేతకు భయపడే కోర్ట్ లో పిటిషన్ వేయించాడనే ఆరోపణలు సైతం వ్యక్తం కావడం విశేషం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *