kejriwaal : సీఎం పదవికి రెండురోజుల్లో రాజీనామా చేస్తానన్న కేజ్రీవాల్ ప్రకటనతో ఇప్పుడు అందరి దృష్టి దిల్లీ రాజకీయాలపై ఉంది. 48 గంటల తర్వాత రాజీనామా చేసిన మరొకరికి సీఎం పగ్గాలు అప్పగిస్తానన్న ఆయన నిర్ణయంపై తీవ్ర చర్చ మొదలైంది. కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలు ఏమిటి, అవి ఏ మేరకు లభిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఆప్ జాతీయ సమన్వయకర్త వ్యూహం ఫలిస్తుందా లేక బెడిసికొడుతుందా అనేది చూడాలి.
కేజ్రీవాల్ రాజీనామా చేస్తున్నారనే వార్త ఒక్కసారిగా గుప్పుమంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆయన రాజీనామా ఢిల్లీ రాజకీయాలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయనే చర్చ కూడా అప్పుడే మొదలైనది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో బరిలోకి దిగి మరోసారి కేజ్రీవాల్ సీఎం పీఠం ఎక్కుతారా, నష్టపోతారా అనే ఈ రెండింటిలో ఎదో ఒకటి జరగటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పార్టీని చీల్చాలని, ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రధాన ఉదేశ్యం బీజేపీ మనసులో ఉందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు కూడా బీజేపీ పాల్పడుతున్నదని ఆయన ప్రధాన ఆరోపణ. ఇదే వాదనతో ప్రజల్లోకి వెళ్లాలనేది అయన రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారం చేపట్టాలనేది కేజ్రీవాల్ ఉదేశ్యం గా కనబడుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తే అక్రమ కేసుల విషయం బలహీనం అవుతుంది. దాంతో ఎన్నికల్లో పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. ఆ ఆలోచనతోనే రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెలుతాడని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ఎత్తులు ఫలించిన నేపథ్యంలో కేజ్రీవాల్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టడం ఖాయం.
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి బీజేపీ అన్ని విధాలుగా బలోపేతమైనది. ఇప్పుడు ఆ పార్టీ ని రాబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎదుర్కోవడం కూడా కత్తి మీది సామే అవుతుంది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఢిల్లీ పీఠం తమదేనని ధీమాలో కాషాయం నేతలు ఉన్నారు. కొన్నాళ్ల నుంచి అప్ ముఖ్య నేతలు జైలు కె పరిమితం అయ్యారు. పోలీస్ కేసులతో తట్టుకోలేక పోతున్నారు.
సత్యేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ వంటి ముఖ్య నేతలకు బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళితే తట్టుకోవడం కేజ్రీవాల్ తో సాధ్యం కాదనే అభిప్రాయాలు సైతం వినబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికి కేజ్రీవాల్ మనసులో ఏముందో తెలియదు కానీ, అయన నడవాలనుకుంటున్న ముందస్తు బాట ఆయన ప్రయాణాన్ని ఎక్కడికి తీసుకు వెళుతుందో వేచి చూడాల్సిందే.