sleep with bra : బ్రా వేసుకొంటేనే కొందరు నిద్రపోతారు. మరికొందరికి బ్రా తీసి వేస్తేనే నిద్ర పడుతుంది. బ్రా వేసుకొని నిద్రపోవడం వలన లాభాలు, నష్టాల గురించి చాలా మందికి తెలియదు. బ్రాతో నిద్రపోతే శరీరానికి ఎలాంటి నష్టం ఉండదని కొందరు అంటారు. మరికొందరేమో శరీరానికి నష్టం జరుగుతుందని కూడా అంటారు. వాస్తవానికి బ్రా తో పడుకుంటే శరీరానికి ఏమి జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం …
ఛాతికి సరిపడే విదంగ బ్రాలను తయారు చేస్తారు. బిగుతుగా ఉంటేనే బ్రా లు పనిచేస్తాయి. బ్రా వేసుకున్న వారు కూర్చోడానికి, నిలబడినప్పుడు చాతి భాగానికి సరైన పట్టు దొరుకుతుంది. ఒకవేళ పడుకుంటే మాత్రం బ్రా కింది భాగంలో ఉండే ప్లాస్టిక్ బ్యాండ్ చాతి వైపుకు చేరుతుంది. అప్పుడు ఛాతి భాగం మొత్తం కూడా బిగుతుగా అయిపోయి చాతి భాగం అంతా కూడా అసౌకర్యంగా ఏర్పడుతుంది. పక్క ఎముకలు కూడా నొప్పిగా తయారవుతాయి. అప్పుడు శ్వాస తీసుకోవడం కూడా కష్టమే అవుతుంది. అంతే కాదు చాతి భాగం అంత కూడా నొప్పిగా తయారవుతుంది.
బిగుతుగా ఉన్న బ్రా వేసుకొని రాత్రి నిద్రపోవడం వలన రొమ్ములోని భాగాలకు రక్తం సరిగా సరఫరా కాదు. బ్రా తీసివేసి పడుకోవడం వలన చాతి భాగంలోని భాగాలకు రక్తం సరిగా సరఫరా అవుతుంది. అప్పుడే వక్షోజాలు ఆరోగ్యాంగా ఉంటాయి. పగలంతా కూడా బ్రా తో ఉన్నవారికి ఏ కాలంలో అయినా చెమట వస్తుంది. రాత్రి కూడా బ్రాతో ఉంటె చర్మ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి రాత్రి పూట బ్రా లేకుండానే నిద్రపోవడం ఆరోగ్య కరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.