gool cm : తెలంగాణ ప్రజలు పొట్ట కూటి కోసం ఎడారి దేశాలకు అనేక మంది వెళ్లారు. కుటుంబాన్ని వదిలిపెట్టి దేశం దాటి పోయారు. వాళ్ళ బాధలు అన్నీ, ఇన్నీ కావు. గత ప్రభుత్వాలు గల్ఫ్ కు వెళ్లిన వారి బాధలు కానీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల భాదలు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను కూడా గత పాలకులు పెడచెవిన పెట్టారు. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ బాధలను తీర్చడానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకొంది.
గల్ఫ్ కార్మికులు ఉన్న నియోజక వర్గాల నుంచి సంబంధిత ఎమ్మెల్యేలు నివేదికలు తయారు చేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఒక సలహా కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటికే అనేక మంది ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేశారు. చనిపోయిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు, వారి పిల్లలకు గురుకుల విద్యాసంస్థలల్లో ఉచిత విద్య అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
గల్ఫ్ ఏజెంట్ల మోసాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. కేరళ రాష్టంలో పాలసీ అవినీతి లేకుండా అమలవుతుంది. ఆ పాలసీని అధ్యయనం చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రజావాణిలో కూడా ప్రత్యేక సెల్ల్ ఏర్పాటు చేస్తున్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి, గల్ఫ్ కుటుంబాలకు అనేక విధాలుగా మేలు జరుగుతుంది. ఇది విజయవంతం అయితే సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ గోల్ కొట్టినట్టే అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.