Coconut Oil : కొబ్బరి నూనె అంటేనే కొందరికి ఏమని తెలుసు అంటే….. కేవలం తలకు రాసుకోడానికే అని ఎక్కువ మందికి తెలుసు. కానీ కొందరికి మాత్రం ఆ నూనె వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని తెలుసు. కొబ్బరి నూనె ను నిత్యం వాడటం వలన చాలా లాభాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…..
వైద్యుల, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం మేరకు కొబ్బరి నూనె తో ఎన్నో లాభాలు ఉన్నవి. వంటకు ఉపయోగించినచో వంటలు రుచిగా ఉంటాయి. కొబ్బరి నూనె బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వేగనిరోధక శక్తి పెంచి గుండెను ఆరోగ్యాంగా ఉంచుతుంది. అంతే కాదు శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. కొవ్వు శాతం తగ్గడంతో శరీరంలోని వాపులు కూడా తగ్గుతాయి.
సహజమైన ఆకలిని కూడా అణచివేస్తుంది. నిత్యం తీరిక లేకుండా ఎదో ఒకటి తినాలి అని అనుకునే వారి కోరిక తగ్గుతుంది. దాంతో బరువు కూడా తగ్గుతారు. ఇతర నూనెలు బదులుగా వంటకు కొబ్బరి నూనె వాడితే చాలా లాభాలు ఉంటాయి. కొబ్బరి నూనెతో చేసిన వంటలు తినడం వలన కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అంతే కాదు ఆకలిని కూడా తగ్గిస్తుంది. శరీర బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.
ప్రతిరోజూ ఉదయం పూట ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక చెంచా కొబ్బరి నూనె కలుపుకొని తాగాలి. అలా తాగితే బరువు తగ్గడం, అజీర్ణం, కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలు దూరమవుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో కొబ్బరి నూనె కలిపి తాగితే మంచి ఫలితాలు కలుగుతాయి.