Banana : ఇంటి ఆవరణలో వివిధ రకాల చెట్లను పెంచుకుంటారు. చాలా మంది మొక్కలు, చెట్లను పెంచే ప్రేమికులు ఉన్నారు. కానీ కొందరికి ఇంటి ఆవరణలో ఏ చెట్టు పెంచాలి, ఏ చెట్టును పెంచకూడదు అనే అనుమానాలు నేటికీ ఉన్నాయి. అయితే ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచవచ్చా లేదా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…..
హిందువులు అరటి చెట్టును పూజ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. అరటి చెట్టును విష్ణువు నివాసంగా వేదంలో చెప్పబడింది. గురువారం అరటి మొక్కను పూజిస్తే విష్ణువు కు పూజ చేసినట్టుగా భావించాలి.
కొందరి నమ్మకాల ప్రకారం అరటి చెట్టును ఇంటి ఆవరణలో పెంచడం వలన అశుభమని అంటారు. అంతే కాకుండా ఇంటి సంతానోత్పత్తికి ఆటంకంగా నమ్ముతారు. అరటి చెట్టు, దాని ఫలములు శాంతిని కలిగిస్తాయని వేదంలో చెప్పబడింది. కాబట్టి ఇంటి ఆవరణలో అరటి చెట్టు శాంతికి నిలయమని కూడా భావించవచ్చు.