Viswambhara : సంక్రాంతికి మెగా స్టార్ చిరంజీవి సందడి చేయబోతున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ” విశ్వంభర ” సినిమాను సంక్రాంతికి తన అభిమానులకు కానుకగా ఇవ్వబోతున్నారు చిరంజీవి.. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత్ దర్శకుడు కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ప్రత్యేకంగా ఉండబోతోంది. బీమవరం దొరబాబులా కనిపించనున్నారు చిరంజీవి. చెల్లెలుగా ముగ్గురు ప్రముఖ హీరోయిన్ లు కూడా నటించబోతున్నారు. ప్రత్యేకమైన పాత్రలతో దర్శకుడు వశిష్ఠ చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా నిర్మిస్తున్నారు. అయితే ఎంతయినా చిరంజీవి కదా… ఆయన డాన్స్ కు పెట్టింది పేరు. అందుకే ఒక ఐటెం సాంగ్ కూడా ” విశ్వంభర ” లో చిరంజీవి కోసం పెడుతున్నారు.
ఈ సినిమాలో ఐటెం సాంగ్ కూడా ఉంటుందని ఇటీవలనే చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. చిరంజీవి కి తగ్గట్టుగా డాన్స్ చేసే నటి కావాలి. అందుకు తగ్గట్టుగా సెట్టింగ్ కూడా అవసరమే. ఐటెం సాంగ్ కోసం ప్రత్యేక సెట్టింగును అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్నారు. ఈ ఐటెం సాంగ్ లో డాన్స్ చేయబోతున్నది కూడా ఎవరో కాదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సీనియర్ నటి కావడం విశేషం. కీరవాణి కూడా ఈ ఐటెం సాంగ్ ను ఈ పాటికే సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ ఐటెం సాంగ్ కోసం ప్రాక్టీస్ కూడ నడుస్తోందని సమాచారం. కానీ ఈ పాటలో నటించే సీనియర్ తెలుగు నటి పేరు మాత్రం చిత్ర బృందం బయటకు వెల్లడించక పోవడం విశేషం.