Home » Mini Projector : రూ. 8 వేలకే ఇంటిలో సినిమా ధియేటర్

Mini Projector : రూ. 8 వేలకే ఇంటిలో సినిమా ధియేటర్

Mini Projector : ప్రస్తుతం కుటుంబ సమేతంగా సినిమా థియేటర్ కు వెళ్లి సినిమా చూసేవాల్ల సంఖ్య తగ్గిపోయింది. దింతో థియేటర్ల ఆదాయం కూడా తగ్గిపోయింది. మధ్యతరగతి వారితో పాటు ఉన్నత శ్రేణి కుటుంబాలు సైతం ఇంటిలోనే హోమ్ థియేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. సాంకేతికంగా అవసరమైన పరికరాలతో ఒక గదిని తయారు చేసుకుంటున్నారు. థియేటర్ కోసం ప్రొజెక్టర్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో తక్కువ ధరకే ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో వస్తున్న ప్రొజెక్టర్లలో పోర్ట్రోనిక్స్‌ బీమ్‌ 440 స్మార్ట్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ ఒకటి కూడా అందుబాటులో ఉంది.

OTT హవా ప్రస్తుతం జోరు మీద ఉంది. ఇంటర్నెట్ వాడకం పెరిగింది. తక్కువ ధరకే OTT అందుబాటులో చేరుతున్నాయి. చాలా మంది ఇంటిలోనే సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు పెద్ద తెరలతో కూడిన టీవీ లకు మార్కెట్ లో డిమాండ్ పెరిగింది. ఇంటిలోనే థియేటర్ ను ఏర్పాటు చేసుకునే వారు పెరుగుతూనే ఉన్నారు. వీరికి తగినట్టుగా మినీ సినిమా థియేటర్లను నిర్మించుకునే వారు కూడా పెరుగుతున్నారు.

తక్కువ ధరలో పోర్ట్రోనిక్స్‌ బీమ్‌ 440 స్మార్ట్‌ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ ఒకటి కూడా మార్కెట్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీని ధర రూ: 8 వేలు గా కంపెనీ లు నిర్ణయించాయి. ఇందులో సినిమా చూడటానికి అవసరమైన ఫీచర్లు అందుబాటులోనే ఉన్నాయి. తక్కువ ధరలో తయారు చేసి వినియోగదారులకు అందుబాటులో పెట్టారు. ఎక్కడికయినా సులభంగా తీసుకెళ్లే విదంగా కిలో రెండు వందల గ్రాముల బరువు మాత్రమే ఉంది. ఈ ప్రొజెక్టర్‌లో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లు సైతం డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ అయి అందుబాటులో ఉండటం విశేషం.

వైఫైకి కనెక్ట్‌ చేసుకొని మనకు ఇష్టమైన సినిమాలను పెద్ద స్క్రీన్‌పై చూసి ఆనందించవచ్చు. అదేవిదంగా స్క్రీన్‌ మిర్రరింగ్ ఫీచర్‌ తోటి మీ స్మార్ట్ ఫోన్‌ లో కానీ మీ ల్యాప్‌టాప్‌ లో కూడా నచ్చిన సినిమాను చూసే విదంగా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 8 వేలతో కొనుగోలు చేసిన ప్రొజెక్టర్‌ లో 720 ఫై రిజల్యూషన్ వీడియో కూడా ప్లే అవుతుంది. కానీ 4కెవి తో సమానమైన క్లారిటీ మాత్రం అందుబాటులో లేదు. ఇందులో ఇన్‌బిల్ట్‌గా 3 వాట్స్‌ స్పీకర్‌ లు కూడా ఉన్నాయి. వీటితో మంచి సౌండ్ వస్తుంది. తక్కువ ధరలో ఇంటిని సినిమా థియేటర్ గా మార్చాలనుకునే వారికి ఈ మినీ ప్రొజెక్టర్‌ మంచి అవకాశం అని చెప్పవచ్చు.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *