Movie : 2024 ముగింపు పలికి, నూతన సంవత్సరంకు స్వాగతం పలకడానికి సమయం మరో వారం మిగిలి ఉంది. 2024 ముగిసేలోపు పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు తదితర భాషల్లో సినిమాలు విడుదల చేయడానికి పెట్టుబడి దారులు సిద్ధంగా ఉన్నారు.
ఓటిటి లో విడుదల అయ్యే సినిమాలు ….
మనోరమా మ్యాక్స్.. డిసెంబర్ 27… పంచాయత్ జెట్టీ.., జియో సినిమా..డాక్టర్స్.. డిసెంబర్ 27, హాట్ స్టార్…. వాట్ ఇప్..? 3.. డిసెంబర్ 22 డాక్టర్ వూ.. డిసెంబర్ 26, జీ5.. ఖోజ్.. డిసెంబర్ 27,…. అమెజాన్ ప్రైమ్..సింగం అగైన్.. డిసెంబర్ 27 థానర.. డిసెంబర్ 27, నెట్ ఫ్లిక్స్..స్క్విడ్ గేమ్ 2… డిసెంబర్ 26 ది ఫోర్జ్.. డిసెంబర్ 22 ఓరిజిన్.. డిసెంబర్ 25.. భూల్ భూలయ్య 3.. డిసెంబర్ 27 సార్గవాసల్.. డిసెంబర్ 27.
Max The Movie: కన్నడ స్టార్ హీరో సుదీప్ హీరోగా నటించిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫిల్మ్ మ్యాక్స్. ఇందులో వరలక్ష్మి, శరత్ కుమార్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ 27న విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.
Barroz 3D Movie: మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బరోజ్ త్రీడీ. ఈనెల 25న సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ సినిమాను వెన్నెపూస రమణారెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 25న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర బృందం.