Mohan babu : టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్‌బాబు హై కోర్ట్ ను ఆశ్రయించారు.ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దింతో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్‌బాబు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై తెలంగాణ హై కోర్ట్ సోమవారం విచారణ చేపట్టింది. మోహన్‌బాబు ఇండియాలోనే ఉన్నట్టుగా ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దుబాయిలో ఉన్న తన మనవరాలిని చూసి తిరుపతి వచ్చినట్టు మోహన్ బాబు తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
అనారోగ్యంతో మోహన్ బాబు బాధపడుతున్నారని ఆయన లాయర్ వాదనలు వినిపించారు. అందుకు సంబందించిన వైద్య పరీక్షలను చూపించాలని న్యాయమూర్తి కోరారు. అదే సమయంలో జర్నలిస్ట్ రంజిత్ హాస్పిటల్ రిపోర్టును ఆయన లాయర్ కోర్టుకు సమర్పించారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.