Home » Rajanikanth : తనకు గుడి కట్టించిన వారిని రజనీకాంత్ ఏం చేసాడో తెలుసా ?

Rajanikanth : తనకు గుడి కట్టించిన వారిని రజనీకాంత్ ఏం చేసాడో తెలుసా ?

Rajanikanth : వేలాది మంది అభిమానులు సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్నారు. ఓ అభిమాని నుంచి రజనీకాంత్ కు ఊహించని బహుమతి లభించింది. తమిళనాడు లో ఉన్న ఒక మాజీ సైనిక ఉద్యోగి కార్తీక్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన ఇంటి ఆవరణలోనే సూపర్ స్టార్ రజని కాంత్ కు అందమైన గుడిని తన సొంత ఖర్చులతో కట్టించారు.

తనకు ఉన్నటు వంటి సొంత ఇంటి స్థలంలో కొంత స్థలాన్ని కార్తీక్ కేటాయించుకున్నాడు. ఆ స్థలంలో గుడిని నిర్మించాడు. అందులో హీరో రజనీకాంత్ విగ్రహం ఏర్పాటు చేసాడు. విగ్రహం బరువు సుమారు 250 కిలోలు ఉంటుందని కార్తీక్ మీడియాకు వివరించాడు.

ఇది ఇలా ఉండగా తన అభిమాని తన గుడి కట్టించాడని తెలిసి రజని కాంత్ ఏమి చేసాడంటే. వెంటనే కార్తీక్ కుటుంబ సభ్యులకు తన సహాయకుల ద్వారా కబురు పంపాడు. కార్తీక్ కుటుంబ సభ్యులను తన ఇంటికి సాదరంగా ఆహ్యానించాడు. ఘనంగా సత్కరించాడు. వారితో కలిసి భోజనం చేశాడు రజనీకాంత్. ఈ విదంగా రజనీకాంత్ ఏర్పాట్లు చేయడంతో కార్తీక్ కుటుంబ సభ్యులు సంతోషించి రజనీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *