కోల్ బెల్ట్ ప్రతినిధి:
చిత్ర పరిశ్రమలో పోటీ తప్పనిసరి. పోటీ లేకుంటే వ్యవస్థలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము.పోటీ అనేది నటన నుంచి మొదలుకొని పెట్టుబడి వరకు ఉంటుంది.అంటే పోటీ అనేది కొట్లాడుకుంటూ చేసే పని కాదు.ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒకరిని మించి ఒకరు నటిస్తూ,ఒకరిని మించి ఒకరు పెట్టుబడులు పెట్టడం అంతే కాదు ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు సినీపరిశ్రమలో పోటీ వాతావరణం మరింత పెరిగింది. పుష్ప సినిమాతో అల్లు అర్జునకు కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ స్థాయి అవార్డు ప్రకటించింది.దింతో నటుల్లో నాకు కూడా ఆ అవార్డు రావాలి, అటువంటి అవార్డును నేను కూడా సాధించుకోవాలి అనే పట్టుదలి వచ్చిందని చిత్రపరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఆస్కార్ అవార్డు ఎప్పుడైతే తెలుగు పరిశ్రమ నటులకు దక్కిందో అప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరికి అసూయ పెరిగింది.మాకు కూడా అలంటి అవార్డు రావాలనే కసితో పలువురు నటులు నటిస్తున్నారు.
మలయాళ నటులంటే అసూయ ….
ఇది ఇలా ఉండగా ఇటీవల ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొందరు నటులపై అసూయ పడుతున్నట్టుగా బహిరంగానే మాట్లాడారు.ఆ నటులంటేనే,ఈర్ష్య,ద్వేషం కలుగుతుందని ఉన్నది ఉన్నట్టుగా మనసులోని మాట చెప్పేశాడు దర్శకుడు రాజమౌళి.మలయాళంలో చాలా మంచి ప్రతిభ ఉన్న నటులు ఉన్నారు. ఇది ఒప్పుకొని చెప్పడానికి నాకు కొంత అసూయ కూడా కలుగుతోంది. నేను దర్శకత్వం వహించిన యాక్షన్ సీన్స్ తో న అభిమానులు,ప్రేక్షకుల చప్పట్లతో,ఈలలతో సినిమా థియేటర్లు మారుమోగుతాయి. మలయాళం సినిమాల్లో మాత్రం చిన్న,చిన్న సీన్స్ కె అభిమానులు చప్పట్లు కొట్టి థియేటర్లలో గోల,గోల చేస్తున్నారు. మలయాళంలో పాత్రకు తగ్గట్టుగా నటులను ఎంపిక చేస్తున్నారు. కథ ఎంపికను ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తయారుచేస్తున్నారు.సినిమా పూర్తి అయ్యేవరకు దర్శక,నిర్మాతలు ఎక్కడ కూడా రాజీపడటం లేదు.కాబట్టే మలయాళంలో చిన్న,చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధరణ రావడం నాకు గర్వాంగా ఉంది. అసూయ కూడా ఉంది. ప్రేమలు అనే మలయాళం సినిమాకు నేను పంపిణీదారునిగా ఉన్నందుకు నాకునేను గర్వపడుతున్నాను అంటూ ఒక సినిమా ఇంటర్వ్యూ లో తన మనసులోని ఎం మాటలను వెల్లడించారు.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-