Actor Jayaprada : మైసూర్ పట్టణానికి 250 కిలో మీటర్ల దూరంలో మదుమలై అటవీ ప్రాంతంలో కేవలం మూడంటే మూడే ప్రభుత్వ గెస్ట్ హౌస్ లు ఉన్నాయి. మదుమలై దట్టమైన అటవీ ప్రాంతం. మూడు వందల మంది పనిచేస్తున్నారు. కానీ వారికీ సరిపడేంత వసతి లేదు. అప్పటికప్పుడు మైసూర్ నుంచి కూలీలను పిలిపించి మూడు వందల మందికి సరిపడేంత వసతి ఏర్పాటు చేశారు. కానీ భోజనం ఏర్పాట్లకు కూడా ఆ అడవిలో ఇబ్బందే. వంట సరుకులు కూడా మైసూర్ పట్టణం నుంచే తెచ్చుకోవాలి. తాగడానికి నీరు కూడా మైసూర్ కు వెళ్లాల్సిందే. అడవిలో పనిచేస్తున్న మూడు వందల మందికి సరిపడేంత విద్యుత్ సరఫరా కోసం అటవీశాఖ అనుమతి కూడా తీసుకున్నారు.
అటవీ మార్గంలో సినీ నటి జయప్రద గుర్రపు బండిపై వెళుతోంది. ఆ సమయంలో బండి ఇరుసు విరిగిపోయి జయప్రద గుర్రపు బండి నుంచి కిందపడి పోయింది. ప్రమాదంలో జయప్రదకు స్వల్ప గాయాలు అయ్యాయి. దింతో రెండ్రోజులు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. 1977, జనవరి నెలలో ప్రముఖ సినీనటుడు ఎన్టీ రామారావ్, జయసుధ, జయప్రద, సత్యనారాయణ, జగ్గయ్య, రాజబాబులతో అడవిరాముడు సినిమా షూటింగ్ జరుగుతోంది. యాభయ్ రోజుల పాటు అడవిలోనే సినిమా షూటింగ్ నిర్వహించారు.ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్ర రావ్ మొదటి సారి సినిమాకు దర్శకత్వం వహించారు. ఏప్రిల్, 1977న సినిమాను విడుదల చేశారు. అడవిరాముడు సినిమా విశాఖపట్టణంలో 366 రోజులు నడిచింది. తెలుగు సినీ పరిశ్రమలో 366 రోజులు నడిచిన మొట్టమొదటి సినిమా కావడం విశేషం . అప్పటి వరకు ఏ తెలుగు సినిమా ఒక్క థియేటర్లో ఎదటిపాటు నడిచిన సందర్భం లేదు.
సినిమాలోని ఆరు పాటలు ప్రేక్షకుల్లో బాగా ఆదరణ పొందాయి. సినిమా మొత్తం అడవిలోనే షూటింగ్ జరిగింది. యాబై రోజుల పాటు చిత్ర బృందం అడవిలోనే ఒంటి షూటింగ్ పూర్తి చేసుకొని రావడం జరిగింది. ఎన్టీ రామారావు అప్పటికే దానవీర శూర కర్ణ సినిమా షూటింగ్లో తీరిక లేకుండా ఉన్నారు. నిర్మాతల మాట కాదనలేక అడవిరాముడు సినిమా ఒప్పుకొని యాబై రోజుల్లో పూర్తి చేసిన తరువాతనే తిరిగి దానవీర శూర కర్ణ సినిమా పూర్తి చేశాడు. ఎందుకంటే దానవీర శూర కర్ణ సినిమాకు ఎన్టీ రామారావ్ నటుడు,నిర్మాత, దర్శకత్వం వహించడం విశేషం. అడవిరాముడు సినిమా షూటింగ్ సమయంలోనే గుర్రపు బండిపై వెళుతున్న సమయంలో నటి జయప్రద కిందపడిపోయింది. ఆమెకు స్వల్ప గాయాలు కావడంతో అడవిలోనే రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు.