Bunny : పుష్ప మొదటి భాగంతో అల్లు అర్జున్ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. ఆ సినిమాతోనే బన్నీ కి జాతీయస్థాయి అవార్డు సైతం దక్కింది. ఇప్పడు పుష్ప రెండో భాగాన్ని దర్శకుడు సుకుమార్ తెర కెక్కిస్తున్నాడు. చిత్ర నిర్మాణంలో ఎక్కడ కూడా రాజి పడటంలేదు పుష్ప రెండో భాగాన్ని విడుదల చేయడంపై అనేక అనుమానాలు తలెత్తాయి అభిమానుల్లో. ఆగష్టు 15 తేదికి అభిమానుల ముందుకు వస్తుందని ఆశించారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన వాయిదా పడింది. ఇప్ప్డుడు డిసెంబర్ 6 తేదికి వాయిదా పడింది.
ఈ తేదికయినా విడుదల అవుతుందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి అభిమానుల్లో. కానీ అల్లు అర్జున్ మాత్రం పట్టుదలతో ఉన్నారు. ఏదిఏమైనప్పటికీ డిసెంబర్ అరుకే సినిమా విడుదల కావాల్సిందే అంటూ ఖచ్చితంగా చిత్ర బృందానికి చెప్పేసాడంట. ఇప్పటికే చాలా నష్టం వాటిల్లింది. డిసెంబర్ ఆరు కూడా వాయిదా పడితే నష్టం మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దింతో సుకుమార్ ఒక నిర్ణయానికి వచ్చాడు. సుకుమార్ తీసుకున్న నిర్ణయంతో బన్నీ ఫుల్ హ్యాపీ గా ఉన్నారని చిత్రబృందం లో పెద్ద టాక్ నడుస్తోంది.
ఇప్పటి నుంచి నిరంతరం సినిమాను షూటింగ్ చేస్తున్నారు. అక్టోబర్ నెలాఖరు నాటికీ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ చేస్తారు. ఎందుకయినా మంచిదే అనే ఉద్దేశ్యంతో సెప్టెంబర్ లోనే షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఒకవైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు స్క్రిప్ట్ దశలోనే ఎడిటింగ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక తయారు చేసుకున్నారు దర్శకుడు సుకుమార్. షూటింగ్, ఎడిటింగ్ ఏకకాలంలో చేయడంతో డిసెంబర్ ఆరో తేదీన విడుదల ఖాయమయ్యింది. సుకుమార్ ఈ నిర్ణయం తోసుకోవడంతో బన్నీ ఉల్ హ్యాపీ గా ఉన్నారు. ఎందుకంటే బన్నీ అనుకున్న తేదీ నాటికి పుష్ప రెండో భాగం విడుదల అవుతుంది కాబట్టి.