Administration : ప్రమాణస్వీకారం కు ముందే పరిపాలన పగ్గాలు చేత పట్టారు ఆ రాష్ట్రంలో . ఏ అధికారి పని చేస్తాడు. ఎవరు పనితీరులో నిర్లక్ష్యంగా ఉంటారు. ఎవరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద అధికారులు ఎవరెవరు ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయాల నుంచి ఫైల్ లు మాయం కాకుండా ముందుగానే చర్యలు తీసుకున్నారు. విద్యుత్ శాఖల పనితీరుపై నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
కీలకమైన అధికారుల కోసం అప్పుడే ప్రక్షాళన చేపట్టారు. వివాదాస్పద అధికారులను పక్కన పెట్టడానికే చర్యలు తీసుకున్నారు.
పట్టణ, గ్రామాల్లో పారిశుద్ధ్యం పై దృష్టి కేంద్రీకరించాలని ప్రమాణ స్వీకారం కు ముందే ఆదేశాలు వెళ్లడంతో అధికారులు పరుగులు పెడుతున్నారు. వర్షాకాలం కాబట్టి ఆరోగ్యశాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో వైద్య, ఆరోగ్యశాఖ సమీక్ష, సమావేశాల్లో మునిగిపోయింది. తాగునీటి ఎద్దడి రాకుండా ఉండడానికి సరఫరా పక్కా ఉండాలని ఆదేశాలు రావడంతో సంబంధిత అధికారులు కాలనీలు, వీదులల్లో తనిఖీలు చేపట్టారు. సాగునీటి ప్రాజెక్ట్ లపై కూడా నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పదకొండు ఎకరాల స్థలంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి మోదీ తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ కీలక నేతలు, జనసేన నేతలు రాబోతున్నారు. పదికి పైగా హెలిప్యాడ్ లు సిద్ధం చేస్తున్నారు.
ముఖ్యఅతిథి గ వచ్చే ప్రతి ఒక్కరి ఏర్పాట్లు చూసుకోడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయడానికంటే ముందుగానే పరిపాలన పగ్గాలు చేత పట్టడంతో కొందరు అధికారుల్లో గుబులు మొదలైనది. ప్రధాన శాఖల అధికారులపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. అధికారుల పనితీరుపై తనదయిన శైలిలో ముద్ర వేయడానికి పావులు కదుపుతున్నారు. పరిపాలన భాద్యతలు ముందుగానే చంద్రబాబు చేపట్టడంతో పలువురు అధికారుల్లో ఆందోళన అప్పుడే మొదలైనది.