NIGAMA MEDIA (P) LTD
2.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, November 23, 2026

బీసీల రాజకీయ ఆత్మగౌరవానికి చుంచు లక్ష్మయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మాజీ ఎమ్మెల్యే జయంతి వేడుకల్లో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

బీసీ సమాజ్ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1979 నుంచి 1983 వరకు లక్షెట్టిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగిన చుంచు లక్ష్మయ్య సేవలను స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటూ మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, అగ్రవర్ణ భూస్వామ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన ధైర్యశాలి అని కొనియాడారు.అంతటి గొప్ప చరిత్ర కలిగిన బీసీ నాయకుడి రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాలు నేటి తరానికి తెలియకుండా పోవడం బాధాకరమని అన్నారు.

ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకుల చరిత్రకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నప్పటికీ, అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చుంచు లక్ష్మయ్య గురించి తగిన స్థాయిలో ప్రస్తావించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో బీసీ నాయకులు ఉన్నప్పటికీ, బీసీల హక్కులు, ప్రజా సమస్యలపై బలంగా గళమెత్తి రాజకీయ నాయకత్వాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. చుంచు లక్ష్మయ్య వంటి పోరాట పటిమ, తెగువ కలిగిన నాయకులు నేటి రాజకీయాల్లో అవసరమని, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలంటే పదవుల కోసం కాకుండా ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.చుంచు లక్ష్మయ్య చరిత్రను మరుగున పడనివ్వబోమని, ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ బీసీల రాజకీయ ఆత్మగౌరవం కోసం నిరంతరం ఉద్యమిస్తామని నరెడ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కర్రె లచ్చన్న, చుంచు గురువయ్య, బెరా ప్రభాకర్, దొమ్మటి అర్జున్, బెర పోషణ, గడ్డం సతీష్ యాదవ్, దుర్గం రాజేష్ గౌడ్, రజక సంఘం మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు పరిపెల్లి శ్రీనివాస్, కురుమ సంఘం నాయకుడు పొట్టాల మల్లేష్, గోత్రాల సంఘం జిల్లా అధ్యక్షుడు గంద శ్రీ తిరుపతి, బీసీ సమాజ్ నాయకులు ఎండీ లతీఫ్, శ్రీధర్ రాజ్, కొడుకా మోహన్, పెద్దపెల్లి సూరయ్య, ఎండీ షఫీ, పల్లపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.