బీసీల రాజకీయ ఆత్మగౌరవానికి చుంచు లక్ష్మయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శం

మాజీ ఎమ్మెల్యే జయంతి వేడుకల్లో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): బీసీ సమాజ్ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1979 నుంచి 1983 వరకు లక్షెట్టిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగిన చుంచు లక్ష్మయ్య సేవలను స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు....