NIGAMA MEDIA (P) LTD
3.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, November 22, 2026

డివైడర్ పనులు పూర్తి చేయాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి బస్టాండ్‌ నుంచి మార్కెట్‌ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో నిలిచిపోయిన డివైడర్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని, శివాని స్కూల్‌ సమీపంలోని యూటర్న్‌ వద్ద స్పీడ్‌ బ్రేకర్లు నిర్మించాలని కోరుతూ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌ తుంగపిండి రాజలింగుకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. బస్టాండ్‌ నుంచి మార్కెట్‌ వైపు వెళ్లే రహదారిలో డివైడర్‌ పనులు సగభాగంలోనే నిలిచిపోయాయని తెలిపారు. పనులు పూర్తికాకపోవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే శివాని స్కూల్‌ సమీపంలోని యూటర్న్‌ వద్ద తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అక్కడ స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు.

వినతిపత్రంపై మున్సిపల్ కమిషనర్‌ తుంగపిండి రాజలింగు సానుకూలంగా స్పందించి, సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ మంచిర్యాల జిల్లా ఈసీ మెంబర్‌ ఎండీ మతిన్‌ ఖాన్‌, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్‌, మందమర్రి మండల అధ్యక్షుడు ఎండీ రహీం బాబా, నాయకులు చింతల సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.