డివైడర్ పనులు పూర్తి చేయాలి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి బస్టాండ్ నుంచి మార్కెట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో నిలిచిపోయిన డివైడర్ పనులను వెంటనే పూర్తి చేయాలని, శివాని స్కూల్ సమీపంలోని యూటర్న్ వద్ద స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని కోరుతూ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. బస్టాండ్ నుంచి మార్కెట్ వైపు వెళ్లే రహదారిలో డివైడర్ పనులు సగభాగంలోనే నిలిచిపోయాయని తెలిపారు. పనులు పూర్తికాకపోవడంతో వాహనదారులు,...