NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, November 12, 2026

సిద్దిపేటలో తెలంగాణ రక్షణ సేన కార్యాలయానికి శంకుస్థాపన

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

శుక్రవారం కవిత పర్యటన..
ఆలయంలో పూజలు, దర్గాలో చాదర్, చర్చిలో ప్రార్థనలు
టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరివేణి స్వప్న ముదిరాజ్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పర్యటించనున్నట్లు టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరివేణి స్వప్న ముదిరాజ్ తెలిపారు. సిద్దిపేటలోని రంగధాంపల్లి తెలంగాణ అమరవీరుల స్తూపం చౌరస్తాలో నిర్మించనున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయ భవనానికి కవిత శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్ తర్వాత సిద్దిపేటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు. కవిత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నాయని చెప్పారు.

కవిత శుక్రవారం ఉదయం 7 గంటలకు బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి ఉదయం 9 గంటలకు సిద్దిపేట చేరుకుంటారు. తొలుత శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మినార్ సమీపంలోని జానుల్లా షా దర్గాలో చాదర్ సమర్పిస్తారు. ఆ తర్వాత ఆర్డీవో కార్యాలయం సమీపంలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఉదయం 10 గంటలకు రంగధాంపల్లి చౌరస్తాకు చేరుకుని తెలంగాణ రక్షణ సేన కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయ నిర్మాణ స్థలంలో మీడియాతో కవిత మాట్లాడనున్నట్లు సిరివేణి స్వప్న ముదిరాజ్ వెల్లడించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.