NIGAMA MEDIA (P) LTD
11.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, November 12, 2026

నాణ్యతే ప్రగతికి ప్రమాణికం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మందమరి ఏరియాలో ఘనంగా బొగ్గు నాణ్యత వారోత్సవాల ప్రారంభం
100 శాతం ఉత్పత్తి లక్ష్యంతో ముందంజ”
మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం బొగ్గు నాణ్యత వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. “నాణ్యతే ప్రగతికి ప్రమాణికం.. దాని పరిరక్షణ అందరి బాధ్యత” అనే నినాదంతో నవంబర్ 18వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై క్వాలిటీ పతాకాన్ని ఆవిష్కరించి వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఐఏఎస్ సుదూర దృష్టి, సమర్థవంతమైన నాయకత్వంతో సంస్థ దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి బొగ్గు ఉత్పత్తి సంస్థగా కొనసాగుతోందన్నారు.

గత 136 సంవత్సరాలుగా దేశంలోని వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, ఇతర పరిశ్రమలకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తూ దేశ ఆర్థిక ప్రగతిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. సంస్థలో నాణ్యతా ప్రమాణాలతో పాటు బొగ్గు ఉత్పత్తి, డిస్పాచ్‌లో మందమరి ఏరియా ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఈ విజయాల వెనుక యాజమాన్యం, అధికారులు, కార్మికుల సమిష్టి కృషి ఉందన్నారు. ప్రతి బుధవారం ఏరియాలోని అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేస్తూ.. ఈ బుధవారం ఏకంగా మూడు రేకుల ద్వారా సుమారు 13 వేల టన్నుల బొగ్గును విజయవంతంగా డిస్పాచ్ చేసినట్లు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరినీ జీఎం ప్రత్యేకంగా అభినందించారు.

ప్రస్తుతం మందమరి ఏరియా 100 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తూ ముందంజలో ఉందని జీఎం ఎన్. రాధాకృష్ణ తెలిపారు. భవిష్యత్తులోనూ బొగ్గు నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు ఉత్పత్తి లక్ష్యాలను నిరంతరం సాధించి సింగరేణి సంస్థకు, మందమరి ఏరియాకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఉద్యోగులు, కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, డీజీఎం పర్సనల్ సిహెచ్. అశోక్, సీఎంఓఏఐ వైస్ ప్రెసిడెంట్ రవి, క్వాలిటీ మేనేజర్ ప్రదీప్, ఏఐటీయూసీ జీఎం స్ట్రక్చర్ కమిటీ మెంబర్ సి.వి. రమణ, జీఎం కార్యాలయ ఫిట్ సెక్రటరీ సృజన గీతిక, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.