NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, November 12, 2026

సర్వే విభాగానికి హై-ఎండ్ కంప్యూటర్లు ప్రారంభం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఆధునిక సాంకేతికతతో సర్వే పనుల్లో వేగం, ఖచ్చితత్వం పెంపు
మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సింగరేణి సంస్థ మందమర్రి ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో సర్వే విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన హై-ఎండ్ కంప్యూటర్లను ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ.. మైనింగ్ కార్యకలాపాల్లో అత్యంత కీలకమైన సర్వే విభాగానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హై-ఎండ్ కంప్యూటర్లు ఎంతో అవసరమని పేర్కొన్నారు. వీటి వినియోగంతో సర్వే డేటా విశ్లేషణ, మ్యాపింగ్‌తో పాటు ఇతర సాంకేతిక పనులను మరింత వేగంగా, ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా సింగరేణి మైనింగ్ కార్యకలాపాల్లో పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కేకేఓసీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు, డీజీఎం (సర్వే) బుఖ్య దేశాయ్, ఐటీ మేనేజర్ రవి, జూనియర్ సర్వే అధికారులు నరేష్, సదానందంతో పాటు సర్వే విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.