కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బీబీపేట గ్రామంలోని శ్రీ వనదుర్గ పెద్దమ్మ అమ్మవారి ఆలయం వద్ద బుధవారం భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఓడి బియ్యం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు శ్రీ మదిరాజ్ సదర్ సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా బుధవారం (11-11-2026) మధ్యాహ్నం 1 గంటలకు శ్రీ వనదుర్గ పెద్దమ్మ ఆలయం వద్ద ప్రత్యేకంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
“అమ్మవారి దర్శనం చేసుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి, అన్నదాన మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందండి” అని బీబీపేట గ్రామ ప్రజలకు శ్రీ మదిరాజ్ సదర్ సంఘం సభ్యులు ఆహ్వానం పలికారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి, అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం ప్రతినిధులు కోరారు.

