రేపు శ్రీ వనదుర్గ పెద్దమ్మ ఆలయంలో అమ్మవారి ఓడి బియ్యం కార్యక్రమం
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట గ్రామంలోని శ్రీ వనదుర్గ పెద్దమ్మ అమ్మవారి ఆలయం వద్ద బుధవారం భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఓడి బియ్యం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు శ్రీ మదిరాజ్ సదర్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం (11-11-2026) మధ్యాహ్నం 1 గంటలకు శ్రీ వనదుర్గ పెద్దమ్మ ఆలయం వద్ద ప్రత్యేకంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. “అమ్మవారి...