NIGAMA MEDIA (P) LTD
6.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, November 4, 2026

హిందూ కళాశాల ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

విద్యార్థుల ఆందోళనకు తెలంగాణ రక్షణ సేన మద్దతు
కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి
TRS చీఫ్ కల్వకుంట్ల కవిత
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

హిందూ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రవేశ ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలను నిరసిస్తూ ఢిల్లీ యూనివర్సిటీలో హిందూ కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిరసన శిబిరాన్ని సందర్శించిన ఆమె విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కళాశాల ప్రైవేటీకరణ ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

గత నెలన్నర రోజులుగా విద్యార్థులు, అధ్యాపకులు నిరసనలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకరమని కవిత పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా సంస్థల స్వతంత్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. హిందూ కళాశాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం ప్రైవేటు సంస్థలు విరాళాలు లేదా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులు అందిస్తే, వాటి సహకారాన్ని కళాశాల అభివృద్ధికి పరిమిత స్థాయిలోనే వినియోగించుకోవాలని సూచించారు. దేశ వనరులను వినియోగించుకుంటున్న సంస్థలు విద్యా సంస్థల అభివృద్ధికి సీఎస్ఆర్ కింద సహకరించడం వేరు, కళాశాల నిర్వహణలో ప్రైవేటు సంస్థల ఆధిపత్యానికి అవకాశం కల్పించడం వేరని పేర్కొన్నారు.

హిందూ కళాశాలకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులు చూస్తుంటే, విద్యార్థులు హిందూ కళాశాలలో చదువుతున్నారా? లేక రిలాక్సో కళాశాలలో చదువుతున్నారా? అన్న భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు. విద్యా సంస్థల గౌరవం, ప్రత్యేకత, విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పోరాటంలో విద్యార్థులు, అధ్యాపకులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చిన కవిత, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యా సంస్థలను ప్రైవేటీకరణ బాట పట్టించకుండా, వాటి అభివృద్ధికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.