హిందూ కళాశాల ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలి
విద్యార్థుల ఆందోళనకు తెలంగాణ రక్షణ సేన మద్దతు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి TRS చీఫ్ కల్వకుంట్ల కవిత కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: హిందూ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రవేశ ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలను నిరసిస్తూ ఢిల్లీ యూనివర్సిటీలో హిందూ కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిరసన శిబిరాన్ని సందర్శించిన ఆమె విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కళాశాల ప్రైవేటీకరణ ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు....