NIGAMA MEDIA (P) LTD
5.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, November 3, 2026

మర్చిపోలేని విషాదం.. క్షమించలేని నేరం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

1984 సిక్కుల ఊచకోత బాధితులకు తెలంగాణ బీజేపీ ఘన నివాళి
కాంగ్రెస్ పాలనలో జరిగిన అమానవీయ ఘటన
దేశం ఎన్నటికీ మరువదు
బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని నేతల ఆకాంక్ష

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

1984లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అమానవీయ సిక్కుల ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన అమాయక సిక్కు సోదరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. 1984లో సిక్కు సమాజంపై జరిగిన దాడులు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని సాగిన ఊచకోత అత్యంత హేయమైన, అమానవీయ ఘటనగా అభివర్ణించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాల బాధ్యత ప్రజల ప్రాణాలకు, హక్కులకు రక్షణ కల్పించడమేనని, అలాంటి సమయంలో జరిగిన ఈ దారుణం దేశ చరిత్రలో మర్చిపోలేని విషాదమని అన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన అన్యాయాలను చరిత్ర ఎప్పటికీ క్షమించదని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన గొంతు వినిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబాలకు న్యాయం లభించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగ్ మోహన్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, మైనార్టీ మోర్చా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.