NIGAMA MEDIA (P) LTD
8.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 31, 2026

కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కాసిపేట 2వ గనిలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
నవంబర్ 4న సింగరేణి జీఎం కార్యాలయాల ముట్టడికి పిలుపు
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట):

ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాసిపేట 2వ గనిలో ఘనంగా నిర్వహించారు. సమావేశానికి గొల్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ఎస్సీడబ్ల్యూయూ (SCWU) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను, సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 1920 అక్టోబర్ 31న స్థాపించబడిన ఏఐటీయూసీ దేశంలో తొలి కేంద్ర కార్మిక సంఘమని, లాలా లజపత్ రాయ్ తొలి అధ్యక్షులుగా, దివాన్ చమన్ లాల్ తొలి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారని గుర్తుచేశారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ, కార్మిక హక్కుల సాధనలోనూ ఏఐటీయూసీ చారిత్రక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

సింగరేణి సంస్థలో ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని అరికట్టి సంస్థను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. నిధుల కొరత కారణంగా కార్మికులకు రక్షణ పరికరాలు, ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను సమకూర్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు సంఘంతో కుదుర్చుకున్న 24 డిమాండ్ల ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, ప్రతి నెలా ఏరియా స్థాయిలో మెడికల్ బోర్డు నిర్వహించి అర్హులకు వైద్యపరమైన ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హులైన వారిని ఏళ్ల తరబడి నిరీక్షింపజేస్తూ విధుల్లోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు. కార్మికుల సొంతింటి పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే నవంబర్ 4న సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల జీఎం కార్యాలయాలను ముట్టడించి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఇన్‌చార్జి చిప్ప నరసయ్య, బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, కొండపల్లి నర్సయ్య, బొల్లుల వెంకటేష్, బొమ్మగంటి సాగర్, కొత్తపల్లి కృష్ణమాచారి, రత్నం రాయలింగు, రామ్ కుమారయ్య, అంజయ్య భాన్, దుర్గం ప్రవీణ్, రాకేష్, సతీష్, శివకుమార్, మహమ్మద్ అమీర్, రామకృష్ణ, సురేష్, సురేందర్ గౌడ్, హరీష్, ఎల్లయ్య, పవన్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.