కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి

కాసిపేట 2వ గనిలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. నవంబర్ 4న సింగరేణి జీఎం కార్యాలయాల ముట్టడికి పిలుపు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాసిపేట 2వ గనిలో ఘనంగా నిర్వహించారు. సమావేశానికి గొల్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ఎస్సీడబ్ల్యూయూ (SCWU) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను, సింగరేణి...