NIGAMA MEDIA (P) LTD
9.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, October 30, 2026

సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల టెండర్లపై న్యాయ విచారణ జరిపించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

90 మంది కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి
మంచిర్యాల జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు ముల్కల రాజేంద్రప్రసాద్ డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సింగరేణి సంస్థలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల టెండర్ల ప్రక్రియపై తక్షణమే సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని మంచిర్యాల జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షుడు ముల్కల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి సంస్థలో గత 12 సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్న సుమారు 90 మంది కార్మికులు, వారి కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో టెండర్ దక్కించుకున్నారంటూ కాంట్రాక్టర్ కుందూరు రమేష్ రెడ్డిపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ వెంటనే స్పందించి నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.

టెండర్ ప్రక్రియ అనంతరం కొంతమంది సెక్యూరిటీ గార్డులను మాత్రమే విధుల్లోకి తీసుకొని, మిగతా కార్మికులను పక్కన పెట్టడం దారుణమని విమర్శించారు. ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి సంస్థను నమ్ముకొని పనిచేస్తున్న కార్మికులను అర్ధాంతరంగా రోడ్డున పడేయడం వల్ల వారి కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాంట్రాక్టు దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ హైదరాబాద్‌లో ఉంటూ స్థానికంగా విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా సెక్యూరిటీ గార్డులకు వైద్య సదుపాయాలు కల్పించే విషయంలో కొందరు వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ ఆరోపణలపై కూడా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని బాధితులు కలిసి విన్నవించినప్పటికీ ఇప్పటివరకు వారికి న్యాయం జరగకపోవడం విచారకరమన్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో ఆ పార్టీ నాయకులకే తెలియాలని వ్యాఖ్యానించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని బాధిత సెక్యూరిటీ గార్డులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి బాధిత కార్మికులకు న్యాయం చేయకపోతే, వారి పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ముల్కల రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.