NIGAMA MEDIA (P) LTD
9.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, October 30, 2026

రగ్బీ పోటీల్లో మందమర్రి శ్రీ చైతన్య పాఠశాలకు బంగారు పతకం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఖేలో ఇండియా అస్మిత సిటీ లీగ్‌లో ప్రథమ స్థానం
రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో గురువారం నిర్వహించిన ఖేలో ఇండియా అస్మిత సిటీ లీగ్ అండర్‌-15 బాలికల రగ్బీ పోటీల్లో మందమర్రి శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో విజయం సాధించి బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ పోటీల్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనగా, లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహించారు. సెమీఫైనల్‌లో శ్రీరాంపూర్‌కు చెందిన ఉజ్వల హైస్కూల్ జట్టుతో తలపడిన మందమర్రి శ్రీ చైతన్య పాఠశాల జట్టు 05-03 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

ఫైనల్ పోటీలో మంచిర్యాల్ శ్రీ చైతన్య పాఠశాల జట్టుతో తలపడిన మందమర్రి జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇరు జట్లు చెరో ఐదు పాయింట్లు సాధించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనంతరం నిర్వహించిన డ్రా ప్రక్రియలో విజయం మందమర్రి శ్రీ చైతన్య పాఠశాల జట్టును వరించడంతో ప్రథమ స్థానం దక్కింది. ఈ విజయంతో నవంబర్ 4, 5 తేదీల్లో సంగారెడ్డిలోని ఓక్సెన్ యూనివర్సిటీలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అస్మిత రగ్బీ పోటీల్లో పాల్గొనేందుకు జట్టు అర్హత సాధించింది. విద్యార్థినులు తమ క్రీడా నైపుణ్యం, పట్టుదల, క్రమశిక్షణ, సమిష్టి కృషితో ఈ విజయాన్ని సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారని యాజమాన్యం పేర్కొంది.

ఈ సందర్భంగా విజేత విద్యార్థినులను పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విద్యా, ఏజీఎం అరవింద్ రెడ్డి, డీఎం సదాశివ రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ నాగరాజు, ప్రిన్సిపల్ ఎం. రమేష్, హైస్కూల్ డీన్ రవితేజ, ప్రైమరీ ఇన్‌చార్జ్ సునీత, వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్, మాధురి తదితరులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారిలోని ప్రతిభను వెలికితీయడంలో శ్రీ చైతన్య పాఠశాల ఎల్లప్పుడూ ముందుంటుందని యాజమాన్యం తెలిపింది. ఈ విజయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.