రగ్బీ పోటీల్లో మందమర్రి శ్రీ చైతన్య పాఠశాలకు బంగారు పతకం

ఖేలో ఇండియా అస్మిత సిటీ లీగ్‌లో ప్రథమ స్థానం రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో గురువారం నిర్వహించిన ఖేలో ఇండియా అస్మిత సిటీ లీగ్ అండర్‌-15 బాలికల రగ్బీ పోటీల్లో మందమర్రి శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో విజయం సాధించి బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ పోటీల్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనగా, లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో...