NIGAMA MEDIA (P) LTD
15.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, October 27, 2026

ఇంద్రవెల్లి పాంచజన్య సంకల్ప సభకు అధిక సంఖ్యలో తరలిరావాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

TRS పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ వెల్త్ న్యూస్(పెద్దపల్లి):

అక్టోబర్ 30వ న తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క అధ్యక్షతన ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు, ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సంకల్ప సభలో ప్రజలు, యువత, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు సమష్టిగా తరలివచ్చి సభలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సలేంద్ర కొమురయ్య యాదవ్ కోరారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.